ధూమ్ దాం న్యూ ఇయర్ కి అంతా సిద్ధం..!
జనవరి ఒకటి రోజున కొత్త సంవత్సరాన్ని జరుపుకోవడం పాశ్చాత్య సంస్కృతి అయినప్పటికీ ప్రస్తుతం భారతదేశంలో కూడా న్యూ ఇయర్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. న్యూ ఇయర్ కు ఒక రోజు ముందు డిసెంబర్ 31 నుంచే న్యూ ఇయర్ వేడుకలు మొదలవుతాయి. ఎక్కడ చూసినా హ్యాపీ న్యూ ఇయర్ అనే బోర్డులు దర్శనమిస్తూ ఉంటాయి. ఇక నగరాల్లో అయితే న్యూ ఇయర్ వేడుకలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నగరంలోని ప్రజలంతా నగరం లోని ముఖ్య ప్రదేశాలు కనిపిస్తారు . అబ్బో డీజే పాటలు... యువత అల్లర్లతో హోరెత్తి పోతాయి న్యూ ఇయర్ సంబరాలు . ఇలాంటి పండగలు సెలబ్రేట్ చేసుకొని వాళ్ళు కూడా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటారు.
అర్ధరాత్రి 12 గంటల వరకు సమయాన్ని కౌంట్ దౌన్ చేస్తూ...సరిగ్గా అర్థరాత్రి 12 గంటలకు కాగానే కేక్ కట్ చేసి... టపాకాయలు పేల్చి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటారు. ఇక ఆ తరువాత ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ... ఈ సంవత్సరం అంతా హ్యాపీగా గడిచిపోవాళ్లని కోరుకుంటారు. నూతన సంవత్సరం నాడు కొత్త బట్టలు ధరించి.. గుడికి వెళ్లి దేవుని దర్శించుకుంటారు కొంతమంది . కొత్త సంవత్సరంలో వచ్చిందంటే ప్రతి ఇంటి ముంగిట రంగు రంగులతో నూతన సంవత్సర శుభాకాంక్షలు అంటూ రంగులు అద్దుతారు. ఇంట్లోకి వచ్చే వారికి పోయే వారికి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు ఇలా చేస్తూ ఉంటారు. కొత్త సంవత్సరాన్ని సాధారంగ ఆహ్వానించేందుకు కూడా ఇలా ఇంటి ముంగిట కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ రంగుల అద్దుతూ ఉంటారు.
ఇక నగరాల్లో అయితే నూతన సంవత్సర వేడుకలు అంబరాన్ని అంటుతాయి. నగరంలో ఎక్కడ చూసినా జన సమూహమే కనిపిస్తుంది నూతన సంవత్సరం రోజున. నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు... ప్రత్యేకంగా కొంతమంది ఈవెంట్లు జరుపుతూ ఉంటారు. ఈ ఈవెంట్ లకి యువత ఎగబడి మరీ వెళ్లి ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇకపోతే నూతన సంవత్సర వేడుకలకు అటు పోలీసులు కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిబంధనలు అమలు చేస్తూ ఉంటారు. ఎక్కువ మద్యం సేవించరాదు... అనుమతికి మించి సౌండ్ పెట్టకూడదని... తాగి డ్రైవింగ్ చేయరాదు అని... ఎలాంటి అల్లర్లు సృష్టించకుండా... ఎలాంటి అశ్లీలత లేకుండా న్యూ ఇయర్ సంబరాలు జరుపుకోవాలని సూచిస్తుంటారు.