ఏ ఏడాది ఫుడ్ డెలివరీ యాప్ లో ఎక్కువగా ఆర్డర్ చేసింది అదేనట..?
ఇప్పుడు ఇంట్లో వంట చేయకపోయినా పెద్ద కంగారేమీ లేదు. ఏ జోమాటోలోనో.. స్విగ్గీలోనో ఆర్డర్ బుక్ చేసేయొచ్చు. ఇప్పుడు ఈ ఫుడ్ డెలివరీ యాప్ లు బాగా పాపులర్ అయ్యాయి. మరి ఎక్కువగా కస్టమర్లు ఈ యాప్ ల ద్వారా ఏం ఆర్డర్ చేస్తున్నారో తెలుసా..
దీనికి సమాధానం ఒక్కటే అదే బిరియానా.. అవునట. ఓ ఫుడ్ డెలివరీ సంస్త తన తాజా సర్వే ద్వారా ఈ విషయాన్ని బయటపెట్టింది. ఈ సర్వే ప్రకారం.. ఇండియన్లు.. దేశవ్యాప్తంగా సగటున ప్రతి నిమిషానికి 95 బిర్యానీలు కావాలంటూ కోరుతున్నారట.
గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం ఇంటర్ నెట్, యాప్లు వినియోగించే వారి సంఖ్య 306 శాతం పెరిగిందట. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో బిర్యానీతోపాటు.. గులాబ్జామున్ ఇష్టంగా ఆస్వాదించారట. ఉదయం.. మధ్యాహ్నం.. అర్ధరాత్రి సమయం ఏదైనా.. నోరూరించే బిర్యానీ ఆస్వాదించేందుకే భోజన ప్రియుల ఇష్టపడుతున్నారట. ఇక వీకెండ్స్ లో అయితే ఎక్కువగా స్వీట్స్ ఆర్డర్ చేస్తున్నారట.