విజయం మీదే : ఈ టిప్స్ పాటిస్తే ఇంటర్వ్యూలలో విజయం మీ సొంతం...!

Reddy P Rajasekhar

మనలో చాలామందికి ఇంటర్వ్యూ అనే పేరు వినగానే అదోరకమైన భయం మొదలవుతుంది. ఇంటర్వ్యూలకు వెళ్లే అభ్యర్థులకు ముఖ్యంగా ఇంటర్వ్యూలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో ఇంటర్యూకు ఎంపికవుతానో లేదో అనే టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. కొన్ని టిప్స్ పాటిస్తే ఇంటర్వ్యూలలో సులభంగా ఎంపిక కావచ్చు. చాలా మందికి విషయ పరిజ్ఞానం ఉన్నప్పటికీ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేరు. ఈ క్రింది టిప్స్ పాటించటం ద్వారా ఇంటర్వ్యూను ఎదుర్కొని ఇంటర్వ్యూలలో సులువుగా విజయం సాధించవచ్చు. 
 
ఉద్యోగం చేయటానికి అవసరమైన వాటిలో ముఖ్యమైనది నైపుణ్యం. కావున మీలో ఉద్యోగానికి సంబంధించిన నైపుణ్యాలు పుష్కలంగా ఉన్నాయని నిరూపించుకోవాలి. ఇంటర్వ్యూ అధికారులకు ఇతర అభ్యర్థులతో పోలిస్తే మీకున్న అదనపు అర్హతలను, ఉద్యోగానికి ఎంపికైతే కంపెనీ అభివృద్ధిలో ఎలా భాగస్వాములవుతారో చెప్పి మెప్పించాలి. ఇంటర్వ్యూకు వెళ్లే ముందు కంపెనీకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించి ఇంటర్వ్యూకు వెళితే {{RelevantDataTitle}}