ఇప్పుడు జనంలో ఆరోగ్య స్పృహ పెరిగింది. కాస్త ఖరీదు ఎక్కువైనా పరవాలేదంటున్నారు. అందుకే ఇటీవల కాలంలో ఆర్గానిక్ ఫుడ్ , ఆర్గానిక్ వస్తువులకు గిరాకీ పెరిగింది. అయితే నిపుణులు కూడా ఇదే చెబుతున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే పాతకాలంలోకి వెళ్లాల్సిందే అంటున్నారు.
పాతకాలం నాటి ధాన్యాలు, పొట్టు తీయని పప్పులను రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే మంచిదని చెబుతున్నారు. శరీరానికి శక్తినిచ్చేవి మాంసకృత్తులు. వీటి కోసం పప్పులని ఎంచుకోవచ్చు. అలసందలు, రాజ్మా, సెనగలు వంటివాటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు.
ప్యాకేజీ ఫుడ్ కంటే.. స్థానికంగా దొరికే గానుగ నూనె.. పల్లీ, నువ్వుల నూనెలను వాడుకుంటే మంచిదని సూచిస్తున్నారు. నూనె, చక్కెర, బెల్లం.. ఇలా ఏదైనా సరే.. కాస్త లిమిట్ లోనే తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. అంతే కాదు.. మన ఆహారంలో ఎక్కువ శాతం తాజా కూరగాయలు ఉండేలా చూసుకోవాలని పదే పదే చెబుతున్నారు. ఈ పాత సూత్రాలే మనకు ఆరోగ్యాన్ని అందించే మూలస్తంభాలని గుర్తు చేస్తున్నారు. అయితే ఇవేమీ కొత్తవి కాదు.. పాత సూత్రాలే.. అందుకే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటున్నారు మరి.
మరింత సమాచారం తెలుసుకోండి: