కనుమ అంటే కోడి కూర... చిల్లు గారె పక్కా....

సంక్రాంతి పర్వ దినాలలో చివరిదైన కనుమ రోజుకి చాలా ప్రాముఖ్యత ఉండి. తమ పశుసంపద కోసం రైతులు కనుమ పండుగ జరుపుకుంటారు. పల్లెల్లో పశువులే గొప్ప సంపద. అవి ఆనందంగా ఉంటే రైతుకి ఉత్సాహం. పంట పొలాలల్లో వీటి పాత్ర ఎంతో ఉంది.

వాటిని గౌరవించి శుభ్రంగా అలంకరించి పూజించి, వాటిని ప్రేమగా చూసుకొనే రోజుగా కనుమను భావిస్తారు. పల్లె ప్రాంతాలలో కనుమ పండుగను వైభవంగా జరుపుకుంటారు. తమకి సుఖ సంతోషాలను అందించడం కోసం అహర్నిశలు కష్టపడుతూ అవి పోషిస్తున్న పాత్రను రైతులు మరిచిపోరు. తమ జీవనాధారమైన పశువుల పట్ల కృతజ్ఞతగా వాళ్లు 'కనుమ' రోజున వాటికి విశ్రాంతినిచ్చి పూజిస్తారు. 

కనుమ రోజు… రైతులు ఆవులు, ఎద్దులతో తమకున్న అనుబంధాన్ని చాటుకుంటారు. వాటితో ఈ రోజు ఎలాంటి పనీ చేయించరు. ఉదయమే పశువులను శుభ్రంగా కడిగి.... పసుపు, కుంకుమలతో బొట్లు పెట్టడమే కాకుండా వాటి మెడలో గల్లుగల్లుమనే మువ్వల పట్టీలు కూడా కడతారు.

కనుమ రోజున మాంసాహారం తినడం ఆనవాయితీ. మాంసాహారులు కానివారు మినుప గారెలు తింటారు. కనుమను ‘ముక్కల పండుగ’ అని అంటారు. సంక్రాంతిపండుగలో మూడవరోజు కనుమ నాడు మాంసాహారం ముందువరుసలో ఉంటుంది. అందుకనే ఈ రొజున పొట్టేలు ని కూడా కొంత మంది వధించి తలకాయ కూరను తింటారు. కనుమ రోజు మినుము తినాలి అని చెప్పిన పెద్దలు అందులోకి నాటుకోడి మాంసం కూడా ఉండాలంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: