జీవిత సత్యాలు: మీ పిల్లలను మీరే చేజేతులా పాడుచేస్తున్నారుగా..?

తమ పిల్లలు మంచి జీవితం గడపాలని ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు. అందు కోసం ఎంతో కష్టపడతారు. డబ్బు సంపాదిస్తారు. మంచి ఖరీదైన స్కూల్లో వేస్తారు. కానీ చాలాసార్లు అవి మంచి ఫలితాలు అందిచవు. ఎందుకు.. ఎందుకంటే.. పిల్లలు స్కూళ్లో కంటే ఇంట్లోనే ఎక్కువ నేర్చుకుంటారు.

ఉదాహరణకు.. కొడుకు ప్రాజెక్టు వర్క్ కోసం ఆఫీసు నుంచి ప్రింట్లు తీసుకొచ్చే తండ్రి పరోక్షంగా అతనికి ఏం నేర్పిస్తున్నాడు? నచ్చిన చీర కొనుక్కుని ఆ విషయం భర్తకు చెప్పొద్దని చెప్పే తల్లి ఆ కూతురుకి ఏం నేర్పిస్తుంది? పిల్లల ఎదురుగా భర్త లేదా భార్యతో గొడవపడటం ద్వారా మీరేం నేర్పిస్తున్నారు?

ఇంటికి బంధువులు వచ్చినప్పుడు నవ్వుతూ ఆహ్వానించి, వారు వెళ్లిపోగానే విమర్శించే మీనుంచి పిల్లలు ఏం నేర్చుకుంటారు తెలుసా? లంచాలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిని తల్లిపై బిడ్డలకు ఏం గౌరవం ఉంటుంది? పిల్లలు చదువుతుండగా మీరు టీవీ చూస్తుంటే వారిపట్ల మీకేం శ్రద్ధ ఉన్నట్లు? పిల్లల్ని కూర్చోబెట్టుకుని జబర్దస్త్ లాంటి షోలు చూస్తూ ఎంజాయ్ చేస్తుంటే విలువలు ఎక్కడినుంచి వస్తాయి?

చూడటానికి ఇవి చిన్న విషయాల్లానే కనిపిస్తాయి. కానీ.. ఇవే పిల్లల మనోఫలకాలపై చెరగని ముద్ర వేస్తాయి. అందుకే మీ పిల్లలు బాగా ఉండాలంటే.. ముందు మీరు సత్ప్రవర్తన నేర్చుకోండి. పిల్లలు చెప్పింది విని నేర్చుకోవడం కంటే.. చూసింది ఎక్కువగా నేర్చుకుంటారు సుమా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: