“బాతులకి” కీలక భాద్యతలు అప్పగించనున్న పాకిస్థాన్..!!!

NCR

పాకిస్థాన్ ని గత కొంతకాలంగా పట్టి పీడిస్తున్న అతిపెద్ద సమస్యకి ఎట్టకేలకి మందు దొరికింది.  పాకిస్థాన్ యంత్రాంగం చేయలేని ఈ పనిని కేవలం బాతులు మాత్రమే పరిష్కరించగలవని తేల్చేసిన అధికారులు అందుకు చైనాని సాయం అడిగారు. పనిలో పనిగా భారత్ సాయం కూడా తీసుకోవాలని భావిస్తున్నారు. ఏంటి కన్ఫ్యూజన్ లో ఉన్నారా..అదేనండి ..పాక్ ని పట్టి పీడిస్తున్న మిడతల సమస్యని పరిష్కరించడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్న పాక్ ఈ సమస్యని శాశ్వతంగా కట్టడి చేయాలని భావించింది అందుకోసం..

అన్ని విధాలుగా ప్రయత్నాలని ముమ్మరం చేస్తోంది. ముందుగా భారత్ నుంచీ క్రిమి సంహారక మందులు దిగుమతి చేసుకుని వాటిని కట్టడి చేయాలని యోచిస్తున్న క్రమంలోనే చైనా సాయం కూడా కోరింది. పాక్ కి సాయం చేయడంలో చైనా ఎప్పుడూ ముందుంటుంది కాబట్టి మిడతల సమస్యకి చైనా విరుగుడు కనిపెట్టింది. అందుకు తగ్గట్టుగా తమ దేశం నుంచీ బాతులని పాక్ పంపిస్తున్నట్టుగా తెలిపింది.

బాతులకి మిడతలు అంటే ఎంతో ఇష్టం కాబట్టి పాక్ మిడతల సమస్యకి బాతులే పరిష్కారమని తెలిపింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా లక్ష బాతులని పాక్ పంపనున్నట్టుగా తెలిపింది. ఇప్పటికే ఈ సమస్యని పరిష్కరించడానికి చైనా తమ నిపుణులని పాక్ పంపింది. తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో పాక్ సమస్య పరిష్కారం అవుతుందని ధీమా వ్యక్తం చేస్తోంది చైనా. ఏదిఏమైనా పాక్ యంత్రాంగం చేయలేని పనిని చైనా బాతుల సైన్యం సెట్ చేయనుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: