జీవిత సత్యాలు: మీరు చేసిన ఆ ఘోరం.. మిమ్మల్ని విడిచిపెట్టదు.. జాగ్రత్త..!?

కర్మఫలం హిందూ తాత్విక చింతనలో ఓ భాగం. చేసిన పాపం వెంటాడుతుందంటారు. ఇది ఎవరికైనా వర్తిస్తుంది. ఉదాహరణకు ఆ శ్రీకృష్ణుడికి కూడా శాపం తప్పలేదు.

కురుక్షేత్రములో దుష్టజన నాశనం పూర్తయినా.. ఆ యుద్ధం జరిపించినందుకు శ్రీకృష్ణుడు గాంధారి చేత శపించబడ్డాడు. యదువంశం నాశనమై పోవాలని శపించింది ఆమె. దాని ఫలితంగానే యాదవకుల నాశనానికి ముసలం పుట్టింది.

తన కళ్ళముందే తన సోదరులు, బంధువులు, మిత్రులు, కుమారులు, మనుమలు యావన్మందీ ఒకరినొకరు నరుక్కుంటూ చచ్చి పీనుగుపెంటలైపోయారు. శ్రీకృష్ణుడి సోదరుడైన బలరాముడు సైతం తన కళ్ళముందే శరీరాన్ని విడిచి వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణుడి విషయంలో ఆయన చేసింది పాపం కాదు.. అయినా కర్మ.. దానికి ఫలితం గాంధారి శాపం.

మరి అంతటి శ్రీకృష్ణునికే కర్మఫలం తప్పనప్పుడు.. మీరూ నేనూ ఎంత. అంతే కాదు.. అసలు మనం కర్మ చేసే సమయంలోనే ఈ స్పృహ ఉంటే.. చాలా వరకూ పాప కార్యాలే ఉండవు. ఏమంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: