పాట : కరోనా - కష్టాలు
మూతికి గుడ్డాయె
ముప్పూటల ఫుడ్డాయె
ఖాళీగా రోడ్లాయె
కదిలితే రాడ్లాయె
బడులన్నీ బంధాయె
సదువేమో సాగదాయె
ఆటపాటలాగిపాయె
సెల్ ఫోన్ చేతికాయె
గుళ్లన్నీ బందాయె
దేవుళ్లకు సెలవాయె
దావఖాన్లు ఫుల్లాయె
డాక్టర్లు దేవుల్లాయె
పచ్చీసు ముప్పాయె
పేకాడితె తప్పాయె
ఆఫీసులు సెలవాయె
సాలరీలు సగమాయె
అరుగుమీది ముచ్చటాగె
వాకిలిమీది సందడాగె
ఇరుగుపొరుగు చిన్నబోయె
ఇళ్లంతా బోసిపోయె
నిదరేమో రాదాయె
టైమ్ పాసు కాదాయె
ఉడుకపోత మొదలాయె
చెమటపోత చిందులాయె
పెళ్ళిళ్ళు లేవాయే
ఫంక్షన్లు బందాయే
పలకరింపు కరువాయే
మనసంతా బరువాయే
విందులన్ని బందాయె
విలాసాల రందాయే
తినబోతే చిరుతిండ్లు
ఇంట్లోళ్ళు తిడుతుండ్లు
సినిమాలు శిన్నబోయె
సీరియళ్లు సన్నబోయె
వార్తల్లో కరోనాయే
వింటుంటే భయమాయె
షేవింగులు పెరిగిపోయె
సేవింగులు కరిగిపోయె
కాలరీలు పెరిగిపోయె
సాలరీలు తరిగిపోయె
ముప్పేమో ముందాయె
దోమలకే విందాయె
మనసేదో అందాయే
మందేమో బందాయే
ఆశచూస్తే ఆగదాయె
పనిచూస్తే దొరకదాయె
కలలన్నీ చెదిరిపోయె
లాక్-డౌన్ ముదిరిపోయె !