పెళ్ళైన కొత్తలో శృంగారంలో మీద ఉన్నంత ఇంట్రస్ట్ తర్వాత తర్వాత చాలా మంది జంటలకు తగ్గిపోతుందంటున్నారు. అది ఎందువల్లనంటే వివాహమైన కొత్తలో ఉన్నంత యాంగ్జైటీ తర్వాత తర్వాత తగ్గిపోతుందట. అలా తగ్గకుండా ఉండాలంటే ఇలా చెయ్యాలంట. శృంగారాన్ని భావప్రాప్తి కలిగే వరకు ఆపకూడదు. పెళ్ళయిన కొత్తలో కొన్నిసార్లు భావప్రాప్తి కలగకపోయినా కూడా సర్దుకుపోతారు. కాని పెళ్ళయిన చానాళ్ళ తరువాత కూడా శృంగార జీవితం బోర్ కొట్టకుండా ఉండాలంటే భావప్రాప్తి ఖచ్చితంగా కలగాలి. కేవలం భావప్రాప్తి ఒక్కటే భార్యాభర్తల బంధానికి బలాన్నిస్తుంది. వయసు పెరిగే కొద్దీ శరీరంలో చాలా మార్పులు వస్తాయి. షేప్ అవుట్ అవుతూ ఉంటాయి. దాంతో భాగస్వాములకి ఒకప్పటిలాగా ఒకరిమీద ఒకరికి శారీరక వాంఛ ఉండకపోవచ్చు. లేదంటే శృంగారం మీద ఆశక్తి తగ్గవచ్చు. అలాంటి సమయంలో కేవలం భావ ప్రాప్తి కోసమే శృంగారం చేయాలి అనుకుంటారు. కాబట్టి భావప్రాప్తి అనేది ఇద్దరికి కలిగేవరకు పనిచేస్తేనే ఆనందం ఆశక్తి కలుగుతుంది.
మానసిక సంబంధాలను బాగా మెయిన్‌టెయిన్ చెయ్యాలి. శరీరం కలయిక బాగా ఉండాలంటే ముందు మానసిక కలయిక బాగా ఉండాలి. మెంటల్‌గా స్టేబుల్‌గా లేని జంట ఫిజికల్‌గా కూడా ఉండలేదు. కాబట్టి ఆ రిలేషన్ షిప్ చెడగొట్టుకోవద్దు. అలాగే ప్రతిరోజూ శృంగారమే చేయాల్సిన పనిలేదు. ఒకరి కోసం మరొకరు సమయాన్ని కేటాయించడం ముఖ్యం. మనసుతీరా మాట్లాడుకోండి దాంతో తనివితారా శృంగారం కూడా చేయవచ్చు.
ఎప్పుడూ ఒకేలా శృంగారం చేస్తూ ఉంటే ఒక పెళ్ళయిన కొద్దిరోజులకే శృంగారం మీద బోర్కొట్టేస్తుంది. అందుకే డిఫరెంట్ యాంగిల్స్‌లో, డిఫరెంట్ పొజీషన్స్లో ట్రైచేయాలి. అదేవిధంగా ఫోర్‌ప్లే కూడా కాస్త ఎక్కువగా ట్రై చేయాలి. అలాగే ఎప్పుడూ ఒకేఇంట్లో ఒకే గదిలో ఉండకూడదు. ఎప్పుడు వీలయితే అప్పుడు బయటకు ట్రిప్స్ వేస్తూ ఉండాలి. ఇక ట్రిప్స్ వేయడం వల్ల మానసిక ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని కలగజేస్తుంది. కాబట్టి ఆ రిలీఫ్ కోసం కొత్త చోట శృంగారం చేయడానికి ప్రయత్నించండి.
మరింత సమాచారం తెలుసుకోండి: