జీవిత సత్యాలు: నువ్వు వినాల్సింది ఆ ఒక్కరి మాట మాత్రమే..!?
మనిషి బ్రతకడానికి పెద్దగా ఖర్చు ఉండదు.. కానీ ! ఎప్పుడైతే ఎదుటి వారిలా బ్రతకాలి అనుకుంటాడో అప్పుడే ఖర్చు అవుతుంది. మంచితనం అనేది ఒక మహావృక్షం లాంటిది ఎవరెంత నరికినా అది మళ్ళీ మళ్ళీ చిగురిస్తూనే ఉంటుంది గుండె లొత్తుల్లో నుండి జీవం పోసుకుంటూనే ఉంటుంది.
మనిషికి కాలం విలువ తెలుసు డబ్బు విలువ తెలుసు స్వేచ్ఛ విలువ తెలుసు బంధాలు విలువ తెలుసు ప్రాణం విలువ తెలుసు కానీ ఇన్ని తెలిసిన మనిషికి ఇంకొక మనిషి విలువ మాత్రం తెలియడం లేదు ! డబ్బు చెబుతుంది అందరినీ మరిచి నన్ను సంపాదించమని.. సమయం చెబుతుంది అన్నింటినీ మరచి నన్ను అనుసరించని.. భవిష్యత్తు చెబుతుంది అన్నింటినీ మరిచి నా కోసం శ్రమించు అని కానీ ! అందరికీ మంచి చేస్తూ ఉండు నీకేం కావాలో నేను చూసుకుంటానని కాలం చెబుతుంది. అందుకే నీవు వినాల్సింది.. నీ అంతరాత్మ మాటే.