గురు దేవో భవః సెప్టెంబ‌ర్ 05న ఉపాధ్యాయ దినోత్స‌వం!

Edari Rama Krishna
గురుర్బహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః
గురుసాక్షాత్‌ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః 

సమాజ దేవాలయానికి నిజమైన రక్షకుడు.. ఆయనెవరో కాదు మనందరికీ విద్యా బుద్ధులు నేర్పే గురువు. అందుకే మన సమాజంలో అమ్మానాన్నల తర్వాత స్థానం గురువులకు ఇచ్చారు. శిశువును లోకానికి పరిచయం చేసిన అమ్మ మొదటి గురువైతే.. గుండెలపై తన్నుతూ ఆటలాడే శిశువుకు నడక నేర్పే నాన్న రెండో గురువు.  

భారత రత్న, భారతదేశ తొలి ఉప రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌. ఆయన పుట్టిన రోజైన సెప్టెంబర్ 5ను ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం. రాధాకృష్ణన్‌1888లో తిరుత్తనిలో జన్మించారు. కేంద్ర ప్రభుత్వం రాధాకృష్ణన్‌పుట్టిన రోజును 1962 నుంచి ఉపాధ్యాయ దినోత్సవంగా పరిగణించి గౌరవిస్తోంది.  ఎంఎన్‌రాయ్‌మాటల్లో చెబితే భారతదేశంలో ఆనాడు ఉన్న మత, ఆధ్యాత్మిక పునరుద్ధరణ వాదాన్ని అకడమిక్‌తాత్విక స్థాయికి తీసుకువెళ్లిన గొప్ప పండితుడు సర్వేపల్లి. ఆయన 15 సార్లు నోబెల్‌సాహిత్య బహుమతికి, 11 సార్లు నోబెల్‌శాంతి బహుమతికి నామినేట్‌అయ్యారు.  భార‌త్‌లో సెప్టెంబ‌ర్ 5వ తేదీన టీచ‌ర్స్ డే జ‌రిగితే అందుకు స‌రిగ్గా నెల‌రోజుల్లోనే ప్ర‌పంచ ఉపాధ్యాయుల దినోత్సవం జ‌ర‌గ‌డం విశేషం.
ఇక ప్ర‌తి ఏడాది యునెస్కో ఓ కొత్త కాన్సెప్టుతో వ‌ర‌ల్డ్ టీచ‌ర్స్ డేను నిర్వ‌హిస్తూ వస్తోంది. అందులో భాగంగానే గ‌త ఏడాది ”The right to education means the right to a qualified teacher” అనే థీమ్‌తో యునెస్కో వ‌ర‌ల్డ్ టీచ‌ర్స్ డే ను నిర్వ‌హించింది. ఇక ఈ డేను ఆ రోజున ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న సుమారుగా 100కు పైగా దేశాల్లో జ‌రుపుకుంటారు.  ఏది ఏమైనా.. ఆ తర్వాత ఈ లోకంలో ఎలా నడుచుకోవాలో నేర్పి, విద్యా బుద్ధులు అందించే ఉపాధ్యాయుడు మూడో గురువు. అందుకే పెద్దలు మాతృదేవో భవ.. పితృదేవో భవ.. ఆచార్య దేవోభవ అన్నారు. సమాజంలో గురువుకు ఉన్న స్థానం అంత గొప్పది. ‘గు’ అంటే చీకటి, ‘రు’ అంటే పోగొట్టేది అని అర్థం. అంటే మనలో అజ్ఞాన పొరలు తొలగించి, జ్ఞానదీప్తిని వెలిగించేవాడు గురువు అన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: