విటమిన్ డి లోపం ఉన్న వాళ్ళు వీటిని తప్పనిసరిగా తీసుకోవాలి..

Satvika
మానవ శరీరానికి అన్నీ విటమిన్లు తప్పనిసరి.. ఒక కూరకు అన్నీ కుదిరితేనె సూపర్ గా ఉంటుంది.. అదే లేకుంటే కూర పాడవుతుంది. మనిషి శరీరం కూడా అంతే అన్నీ విటమిన్లు, మినరల్స్ చక్కగా ఉంటేనే శరీరం యాక్టీవ్ గా ఉంటుంది. లేకుంటే ఏదోక లోపంతో నానా ఇబ్బందులూ ఎదుక్కోవాలి.. ఇక పోతే మానవ శరీరానికి డి విటమిన్ అనేది చాలా ముఖ్యమైనది.. ఆ విటమిన్ వల్ల ఎముకలు బలంగా ఉంటాయి లేకుంటే పూర్తిగా వీక్ అయిపోతాయి..



డి విటమిన్ పూర్తిగా దొరికే ఆహారాన్ని తీసుకోవడం వల్ల మళ్లీ శరీరం యాక్టీవ్ గా ఉంటుందట లేకుంటే లేదని నిపుణులు అంటున్నారు. శరీరంలో రోగనిరోధక శక్తిని కాపాడుకోవడంలో విటమిన్ డి పెద్ద పాత్ర పోషిస్తుంది. కరోనా వైరస్ మహమ్మారి సమయంలో మనకు రోగనిరోధక శక్తి చాలా అవసరం. ఇమ్యూనిటీ పెరగడానికి డి విటమిన్ సహాయపడుతుంది. కరోనా వైరస్ ను తగ్గించడానికి విటమిన్ డి సాయపడుతుంది.. మరి అలాంటి డి విటమిన్ పుష్కలంగా దొరికే ఆహార పదార్థాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 


పుట్టగొడుగులు

పుట్టగొడుగులు వల్ల మనకు చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఆరోగ్యానికి పుట్టగొడుగులు చాలా మంచివి. వీటిల్లో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. పుట్టగొడుగులులతో అనేక రకాల వంటకాలు చేసుకోవచ్చు.


పాల ఉత్పత్తులు

పాలు, జున్ను, పెరుగు, ఇతర పాల ఉత్పత్తుల్లో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. మీ డైట్‌లో వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల మీ శరీరానికి కావలిసిన విటమిన్ డి లభిస్తుంది.

సోయా , బాదం పాలు


వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది.. 


గుడ్డు


గుడ్డు లోని పసుపు సోన తినడం వల్ల మనకు విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది.



వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది.. వీటికి డి విటమిన్ పుష్కలంగా ఉంటుంది.. మీరు కూడా వీటిని తప్పక ఆహారంలో చేర్చుకోవడం మంచిది అని నిపుణులు అంటున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: