చేదైన కాకరకాయలతో ఆరోగ్యానికి ఎన్ని లాభాలున్నాయో తెలుసా...
కాకరకాయ శరీరంలోని వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. వీటిని ఉడికించిన నీళ్లు తాగితే ఇన్ఫెక్షన్ల్లు దరి చేరవు.శ్వాస కోస సమస్య నుంచి ఉపశమనం కలిగించడంలో కాకర రసం బాగా పని చేస్తుంది. తరచుగా కాకరకాయ తింటే జలుబు, దగ్గు, ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యల నుంచి త్వరగా కోలుకోవచ్చు..కాలిన గాయాలను ,పుండ్ల ను మాన్పడంలో కాకరకాయ లోని గుణాలు బాగా పని చేస్తాయి. రక్తాన్ని శుధ్ధి పరిచి గుండె కు రక్త సరఫరా సక్రమంగా జరిగేలా చేస్తుంది. బరువు తగ్గాలనుకున్నా ,శరీరం లో అనవసర కొవ్వు కరగాలన్నా కాకర రసం తాగాలి.
కాకర కాయలు చేదుగా ఉన్నా కూడా ఔషధాలు చాలా ఉన్నాయి.. అయితే షుగర్ పేషంట్స్ ఎక్కువగా తింటారు. ఇక ఏదైతే ఆపరేషన్ జరిగిన తర్వాత ఈ కాకర కాయలు కారం తింటే పుండ్లు పట్టకుండా త్వరగా తగ్గిపోతాయి.. ఇకపోతే కాకరకాయను పచ్చిగా తినడం వల్ల ఇంకా మంచిదని అంటున్నారు. ఈ కాయలను కూర చేసుకున్న లేదా చిప్స్ లేదా ఢీ ఫ్రై చేసుకొని తింటే కొంచెం చేదు తగ్గుతుంది.ఉదర సంబంధ వ్యాధులను కాకర మంచి ఔషధం .అందుకే రుచిలో చేదుగా ఉన్నా కాకరను తరచుగా తీసుకుంటే ఆరోగ్యానికి అమృతంలా పనిచేస్తుంది... చూసారుగా చేదుగా ఉన్నా ఈ కాయలలో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. మీరు ట్రై చేయండి.. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి..