వాటి పాలను తాగితే బరువు తగ్గుతారా?

Satvika
మారిన ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది బరువు పెరుగుతారు. అయితే, అంతే ఈజీగా తగ్గడానికి ట్రై చేస్తారు. కొందరైతే ఫిట్ నెస్ సెంటర్ల వెనక పడతారు. కానీ ఎటువంటి ప్రయోజనాలు లేక అలాంటి ప్రయత్నాలు విరమించుకుంటారు. అయితే కొన్ని డ్రింక్ ల వల్ల బరువు తగ్గుతారని అంటున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..



క్యాలరీలు తక్కువగా ఉండే, పోషకాలు ఎక్కువగా ఉండే పానీయాల్లో ఆల్మండ్ మిల్క్ బాగా పాపులర్ అయింది. ఆల్మండ్స్ ని రుబ్బి నీటితో కలిపి ఆ మిశ్రమాన్ని ఫిల్టర్ చేయడం ద్వారా ఆల్మండ్ మిల్క్ తయారు చేస్తారు. ఇది చూడడానికి పాల లాగే ఉంటుంది, నట్స్ ఫ్లేవర్ తో ఉంటుంది. ఈ ఆల్మండ్ మిల్క్ యొక్క పోషకాల విలువని పెంచడం కోసం కాల్షియం, రైబోఫ్లావిన్, విటమిన్ ఈ, విటమిన్ డీ వంటి వాటిని ఈ మిల్క్ కి కలుపుతారు. ఈ ఆల్మండ్ మార్కెట్ లో లభిస్తుంది, చాలా మంది ఇంట్లోనే చేసుకుంటారు కూడా. ఆవు పాలు, గేదె పాలు పడని వారికీ, అవి తాగడం ఇష్టపడని వారికీ ఆల్మండ్ మిల్క్ మంచి ప్రత్యామ్నాయం.



ఇకపోతే బాదం పాలు రుచి నచ్చి చాలా మంది తాగడానికి ఇష్టపడతారు. ఆల్మండ్ మిల్క్ లో ఆవుపాల కంటే క్యాలరీలు తక్కువ. క్యాలరీలు తగ్గించి బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్. అయితే, మార్కెట్ లో లభించే కమర్షియల్ వెరైటీస్ లో షుగర్స్ కలిపి ఉండవచ్చు, ఇంట్లో తయారు చేసుకునే ఆల్మండ్ మిల్క్ లో ఆల్మండ్స్ మిగిలిపోయి ఉండవచ్చు. ఎలా అయినా సరే, క్యాలరీలు ఎక్కువగానే ఉంటాయి. ఆల్మండ్స్ లో విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆల్మండ్ మిల్క్ లో కూడా విటమిన్ ఈ ఎక్కువగానే ఉంటుంది, కమర్షియల్ వెరైటీస్ లో విటమిన్ ఈ యాడ్ చేస్తారు కూడా.. ఇకపోతే ఈ బాదం వల్ల గుండె, ఎముకలు , కళ్ళకు కూడా మంచిదని అంటున్నారు. ఇంకా ఆలస్యం ఎందుకు మీరు కూడా రోజువారీ ఆహారంలో బాదం ను చేర్చుకోండి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: