ఈ అలవాట్లు మానుకుంటే మీ మూత్రపిండాలు పదిలంగా ఉంటాయి.. !!
మీ రక్తంలో ఉన్న ధూళి మీ శరీరంలోనే ఉంటుంది.అలా వ్యర్థ పదార్ధాలు శరీరంలో ఉంటే మీ మూత్రపిండాలకు మంచిది కాదు. అలాగే మూత్రవిసర్జన ఆపడం కూడా మంచి పద్ధతి కాదు. మీరు క్రమం తప్పకుండా మూత్రవిసర్జన ఆపివేస్తే మీ మూత్రపిండాలకు ఇది చాలా ప్రమాదకరం. ఇలా చేయడం వలన కిడ్నీలో రాళ్ళు తయారుచేసే అవకాశాలు పెరుగుతాయి. అలాగే మూత్రపిండాలకు చాలా నష్టం కలిగిస్తుంది. కాబట్టి మూత్రం వచ్చినప్పుడల్లా ఆగకండి.
అలాగే మీ రోజువారీ ఆహారంలో ఉప్పు ఎక్కువ తీసుకోవడం మంచిది కాదు. ఉప్పు అధికంగా ఉండటం వల్ల మీ రక్తపోటు పెరుగుతుంది.అలాగే మూత్రపిండానికి అదనపు భారం పడుతుంది.అలాగే ఎక్కువ శీతల పానీయాలు తాగడం ద్వారా, మీ శరీరం యొక్క ప్రోటీన్ మీ మూత్రం ద్వారా విసర్జించబడుతుంది, అంటే మీ మూత్రపిండాలు ఆ సమయంలో సరిగా పనిచేయవు. అలాగే ప్రతి రోజు సమయానికి సరిపడా నిద్ర పోవాలి. మీరు సరిగ్గా నిద్రపోలేకపోతే ఇది మీ మూత్రపిండాలపై ఒత్తిడి పెరుగుతుంది.అలాగే మీ రోజు వారి ఆహార పదర్ధాలలో పండ్లను ఎక్కువగా తీసుకోవడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది.