జామ ఆకులు ఆడవాళ్ళలో అలా.. మగవారిలో ఇలా మేలు చేస్తాయట..

Satvika
జామ ఆకులు ఎన్నో రోగాలను ఇట్టే నయం చేస్తాయి.. సీజన్ లో దొరికే ఈ కాయలు మనుషులకు ఎంతో మేలు చేస్తాయని న్యూట్రీషన్లు సూచిస్తున్నారు. అయితే , ఆడ వారికి మరియు మగ వారికి వేరు వేరు గా ఫలితాలను ఇస్తాయని అంటున్నారు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

కీళ్ల నొప్పులతో బాధపడేవారు జామ ఆకులను కొద్దిగా వేడి చేసి వాపులున్న చోట కట్టుకుంటే కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

జామ పువ్వులు కూడా మంచి ఔషధం అని అంటున్నారు. ఆ పువ్వులను తీసుకొని మెత్తగా నూరి కళ్లపై ఉంచితే కళ్లు తేటగా తయారవుతాయి. కళ్ల కలక, కళ్లు నీరు కారడం, కళ్లు ఎర్రబడటం వంటి సమస్యలకు అద్బుత ఫలితం కనిపిస్తుంది. పురుషుల్లో వీర్యకణాల ఉత్పత్తిని పెంచే గుణాలు కూడా జామ ఆకులు కలిగి ఉన్నాయని అధ్యయనాల్లో రుజువు చేశారు.

జుట్టు ఊడకుండా జామ ఆకులు పనిచేస్తాయి.. జుట్టు రాలడాన్ని నివారించడంతో పాటు జుట్టు పెరగడానికి దోహదపడుతాయి. సరిపడా జామ ఆకుల్ని శుభ్రం చేసుకుని తగినన్ని నీరు పోసి 15 నిముషాల సేపు మరిగించాలి. చల్లారాక ఆ నీటిని తలపై నెమ్మదిగా అప్లై చేస్తూ బాగా మర్దనా చేయాలి. గంట తరువాత తలస్నానం చేయాలి. తరచుగా ఇలా చేయడం వల్ల వెంట్రుకల కుదుళ్లు గట్టిపడి జుట్టు బాగా పెరగడానికి సహాయపడుతుంది.

నోటి రుచి తగ్గడం వంటి సమస్యలతో బాధపడేవారు జామ ఆకుల్ని మెత్తగా పేస్ట్‌లా రుబ్బి దానికి కొద్దిగా ఉప్పు , అర చెంచా జీలకర్రను కలిపి వేడినీళ్లతో తీసుకుంటే ఆకలి పెరుగుతుంది..

ఆకులను నేరుగా లేదా జామ కషాయంగా తీసుకోవడం వలన అది మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, శరీరంలో రక్తం అన్ని అవయవాలకు సక్రమంగా అందేలా చూస్తుంది. అందువల్ల గుండె సంబంధిత వ్యాధుల నుంచి కాపాడుతుంది.

మన చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మొటిమల సమస్యతో బాధపడేవారు జామ ఆకుల్ని మెత్తగా రుబ్బి ముఖానికి లేపనంలా పూసుకొని పది నిమిషాల్లో కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది..ఇలా కొద్ది రోజులు వాడితే సరిపోతుంది.

చూసారుగా జామ ఆకుల వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. పైన తెలిపిన సమస్యలు మీకు ఉంటే మీరు ట్రై చేయండి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: