30 పై బడిన వాళ్ళు ఈ ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి..
మహిళల్లో వయసు పెరిగే కొద్దీ ఎముకల్లో సాంద్రత తగ్గి వారు ఆస్టియోపోరోసిస్ బారిన పడుతుంటారు. చాలా మంది మహిళల్లో ఎముకలు బాగా బలహీనంగా, సన్నగా ఉంటాయి. ఈస్ట్రోజెన్ వంటి హార్మోన్ స్థాయి తక్కువగా ఉండటం వల్ల పురుషులతో పోలిస్తే మహిళల్లో ఆస్టియోపోరోసిస్ అభివృద్ధి చెందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మహిళలు మోనోపాజ్ దశ వల్ల వారు బలహీనపడటానికి మరో కారణం. అందుకే మహిళల్లో ఎముకలు గట్టిపడాలంటే వారు మరింత కాల్షియం ఉన్న ఆహారాలు తీసుకోవాలి..
సోడియం తీసుకోవడం చాలావరకు తగ్గించాలి. దీంతో బిపి సమస్య రాకుండా ఉంటుంది.విటమిన్ D ఎక్కువగా సూర్యరశ్మి ద్వారా లభించే వనరు. కానీ ఎక్కువ మంది ఇళ్లు, ఆఫీసులకే అతుక్కుపోతున్నారు. బయట ప్రయాణించే సయయంలో కూడా ఎక్కువగా కార్లు, ఆటోలకే ప్రాధాన్యమిస్తున్నారు. దీంతో విటమిన్ D బాధితులు ఎక్కువగా ఉంటున్నారు. విటమిన్ D శరీరంలోని అనేక అంతర్గత విధుల్లో కీలక పాత్ర పోషిస్తుంది. గుండె జబ్బులు, ఆస్టియోపోరోసిస్, డయాబెటిస్, క్యాన్సర్, బరువు పెరగకుండా నిరోధించడంలో విటమిన్ D సహాయపడుతుంది.
30 ఏళ్లు దాటితే వారిలో కండరాలు బలహీనపడటం సహజమే. సుమారు 3 నుంచి 8 శాతం వరకు వారిలో కండరాలు బలహీనపడే అవకాశం ఉంటుంది. 60 ఏళ్ల తర్వాత కండరాలు క్షీణించే రేటు అనూహ్యంగా మరింత పెరుగుతుంది. ఇక 80 ఏళ్లు వచ్చేసరికి కండరాల్లో బలం సగం క్షీణిస్తుంది. వయస్సు పెరిగే కొద్దీ ఎక్కువ ప్రొటీన్లు ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటే చాలా మంచిది.
చూసారుగా 30 పైన మహిళలు ఎక్కువగా వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది.. జాగ్రత్త సుమీ..