శభాష్‌.. డా. జి. సమరం.. సుఖ సంసారం.. సంఘసేవ..!

సెక్స్.. ఇది మానవుడికి ఆహారం, నిద్ర ఎలాగో అలాగే.. కానీ..ఆహారం, నిద్ర గురించి ఎంత సులభంగా మాట్లాడుకుంటామో.. జాగ్రత్తలు చర్చించుకుంటామో.. ఈ విషయంలో అలా కాదు.. అసలు దీని గురించి చెప్పడం సంగతి పక్కకు పెడితే మాట్లాడటమే పాపం అన్నట్టుగా ఉండేది ఒకప్పటి పరిస్థితి.. ఇప్పుడుకాస్త టెక్నాలజీ పెరిగి మీడియా అందుబాటులోకి వచ్చింది కానీ.. 30- 40 ఏళ్ల క్రితం ఈ సెక్స్ గురించి సందేహాలకు సమాధానాలు ఇచ్చింది.. ఇప్పటికీ ఇస్తున్నది డా.జి. సమరం. ఈ విషయాన్ని తన స్వీయ అనుభవం ద్వారా నెటిజన్ హరికృష్ణ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ చిరు వ్యాసం మీ కోసం.
...............
హరికృష్ణ ఎం.బి.
 
డిగ్రీ లో ఉండగా అనుకుంటా, ఒక ఫ్రెండ్ చెప్పాడు... "వాళ్ళ మామ కి పెళ్ళైతే నాలుగో రోజు వాళ్ళావిడ అత్తయ్య దగ్గరికి వెళ్లి కంప్లైంట్ చేసిందట, తన భర్త వచ్చి రోజూ మీద పడి నిద్రపోతున్నాడు... అంతకన్నా ఏమీ చెయ్యట్లేదు" అని... అప్పుడు ఆమె ఎవరికో చెప్తే, వాళ్ళు అతనికి జ్ఞానబోధ చేస్తే కానీ సమస్య తీరలేదని..

అది అందరికీ కావాలి... అందరూ చేసేదే... కానీ ఎవ్వరూ ఎవరికీ చెప్పరు. అంతా confusion ... 9th class లో నే తెలుసుకోవాల్సిన విషయాన్ని టీచర్లూ చెప్పరు. ఇంట్లో పెద్దోలూ చెప్పరు. కొంత ఫ్రెండ్స్ చెప్తారు... కొంతమంది అంతా తప్పులు చెప్తారు... ఏదో వీడియోస్ చూస్తారు, అందులో నూ వాస్తవ దూరం గా చూపిస్తారు... పాపం... ఎంతో మందికి ఏమీ తెలియక ఎంత సతమతవుతుంటారో.

ఇప్పుడంటే సమాచార విస్ఫోటనం ... overflow ఉంది నెట్లో... కానీ ఒకప్పుడు... అలాంటి కన్ఫ్యూషన్ లో మేము చిన్నప్పుడు మాకు ఒక కనపడని గురువు మన సమరం.. జీవితం లో ఒక ముఖ్యమైన గురువు. ఎన్నో అపోహలను, అనుమానాలను పరోక్షం గా నివృత్తి చేసిన మహానుభావుడు.. చిన్నప్పుడు ఎక్కడ స్వాతి బుక్కు కనపడినా గబుక్కున దొరకబుచ్చుకుని సెంటర్ పేజీకి వెళ్తే కానీ మెదడు శాంతించేది కాదు... ఆయనకు చాలా చాలా థాంక్స్.. ఆయన్ని ఎన్నో ఏళ్ళు encourage చేఇస్నా స్వాతి వారికి కూడా...

జనాలు మాట్లాడ్డానికి మొహమాటపడే, అసహ్యించుకునే ఎన్నో పదాలను, వ్యాఖ్యలను అలవోక గా రాస్తూ పలుకుతూ ఆయన ఒక ఫోబియా ని పటాపంచలు చేసారు. బహుశా తెలుగు సమాజం లో ఆయన తర్వాత ఈ విషయం లో అంత రీచ్ ఉన్న వాళ్ళు లేరు.

మనిషి కి ఆహారం, నీరు, ఆరోగ్యం లా శృంగారం కూడా ఒక నిత్యావసరమే. "ఆ మాకందరికీ చెప్పారా, మేము కనలేదు పదిమందిని" అనొచ్చు.. శృంగారం అంటే పిల్లల్ని కనడం కాదు, కుక్కలూ కంటాయి అలా అయితే.

నా కొలీగ్ చెప్పేవాడు... అసలు జనాలందరూ రొమాన్స్ ని సీరియస్ గా తీసుకోవాలి అప్పుడు ప్రపంచం లో ఇంత అలజడి ఉండదు... అందరూ బిజీ గా ఉంటారు... కొంత sensible గా కూడా తయారు అవుతారు, భార్యాభర్తల మధ్య గొడవలూ తగ్గుతాయి... సొసైటీ లో చాలా శాంతి ఉంటుంది అని ఆ రోజులు రావాలని కోరుకుంటూ...
అందరికీ  all the best...

- హరికృష్ణ ఎం.బి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: