కరోనా రోగుల ఆహారపు నియమాలు.. !

Suma Kallamadi
ఇప్పుడు యావత్ భారత దేశం అంతా కరోనా మహమ్మారి వలన నానా ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ఈ మహమ్మారి ఎప్పుడు? ఎలా? ఎవరికి సోకుతుందో కూడా తెలియడం లేదు. కోవిడ్ భారిన పడి చాలామంది తమ ప్రాణాలను సైతం పోగొట్టుకుంటున్నారు. అలాగే మరి కొంతమంది ఇంటికే పరిమితం అయ్యి బలవర్ధకమైన ఆహారం తీసుకుంటూ రోగనిరోధక శక్తిని పెంచుకుంటున్నారు. అయితే కొవిడ్‌ సోకినప్పుడు బలవర్థకమైన ఆహారం తీసుకోవాలి అనే విషయం అందరికి తెలిసిందే కానీ అదే సమయంలోతెలియకుండానే కొన్ని తప్పులు చేస్తున్నారు. అసలు కోవిడ్ వచ్చిన వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలి.? ఎటువంటి ఆహారం తినకూడదో అనే విషయాలు ఒకసారి తెలుసుకుందాం..!



ముందుగా చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ప్యాకేజ్‌డ్‌ ఫుడ్‌ ఎక్కువగా తినడం. కొవిడ్‌ సోకడంతో ఒంట్లో ఓపిక ఉండదు.త్వరగా నీరసించిపోతాం. ఈ కారణం చేత వంట చేసుకునే ఓపిక లేకపోవడంతో నేరుగా తినగలిగే ప్యాకేజ్‌డ్‌ ఫుడ్‌ ఎంచుకోవడం చేస్తున్నారు. కానీ ఈ పద్ధతి సరి కాదు. ఇలాంటి ప్యాకేజ్‌డ్‌ ఫుడ్స్‌లో సోడియంతో పాటు నిల్వ కోసం ప్రిజర్వేటివ్స్‌ ఉంటాయి. శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ను పెంచే ఈ పదార్థాలు కలిసిన ఆహారం తింటే, కొవిడ్‌ నుంచి కోలుకునే వేగం ఆలస్యం అవుతుంది అలాగే రోగనిరోధకశక్తి కూడా సన్నగిల్లుతుంది.అందుకే వీటికి దూరంగా ఉండడం మంచిది. అలాగే  ఘాటుగా ఉండే మసాలాలు, కారాలు గొంతును ఇరిటేట్‌ చేసి, దగ్గును పెంచుతాయి. కాబట్టి వంటల్లో కారానికి బదులుగా మిరియాల పొడి వాడుకోవాలి.



వేపుళ్ళకి దూరంగా ఉంటే మరి మంచిది అంటున్నారు నిపుణులు. వేపుళ్లలో కొవ్వు పదార్థం ఎక్కువ. దాంతో పదే పదే తినాలనే కోరిక పెరుగుతుంది. పైగా ఇవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుని, జీర్ణవ్యవస్థ మీద భారం పెంచుతాయి.

ఇంట్లో ఉండడం వలన అరుగుదల అనేది తగ్గుతుంది. పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా మీద కొవ్వులు చెడు ప్రభావం చూపిస్తాయి. ఫలితంగా వ్యాధినిరోధకశక్తి తగ్గుతుంది. అంతే కాకుండా వేయించిన పదార్థాలు శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కరోనా సోకిన వ్యక్తి ఇంట్లో ఉండి  చికిత్స తీసుకుంటూ కోలుకునే సమయంలో శీతల పానీయాలు అసలు తాగకూడదు.అలాగే తీపిగా ఉండే పానీయాలన్నీ శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ను పెంచి, కోలుకునే వేగాన్ని తగ్గిస్తాయి. కాబట్టి వీటికి బదులుగా మజ్జిగ, సోడా కలిపిన నిమ్మరసం లాంటి పానీయాలు తాగాలి. శీతల పానీయాలు తాగడం వలన దగ్గుఆయాసం ఎక్కువ అయ్యే అవకాశం ఉంది.అలాగే వీలయితే పండ్లు, డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటూ రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి.. !!



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: