బిల్ గేట్స్ దంపతుల విడాకులకు.. అసలు కారణం ఇదేనా?
ఇక ఇలా ఏకంగా బిల్ గేట్స్ దంపతులు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు అని చెప్పాలి. అలాంటి వాళ్ళు ఒక్కసారిగా 27 ఏళ్ల దాంపత్య బంధానికి బ్రేక్ చేసి విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించడం మాత్రం ఎంతో హాట్ టాపిక్ గా మారిపోయింది.. అసలు వీరిద్దరూ ఈ వయసులో విడాకులు తీసుకోవడానికి కారణం ఏంటి అన్న దానిపై సరైన కారణం ఇప్పుడు వరకు బయటికి రాలేదు. కానీ ఇటీవలే వీరిద్దరూ విడాకులు తీసుకోవడానికి గల కారణం ఏంటి అనే విషయంపై ఒక వార్త వైరల్ గా మారిపోయింది. అయితే ఇప్పుడు కాదు ఇద్దరు దంపతులు ఎప్పుడో విడాకులు తీసుకోవాలని భావించారట. కానీ తన చిన్న కూతురుకి 18 ఏళ్లు నిండేంత వరకు కలిసి ఉండాలని భావించి విడాకులు తీసుకోకుండా ఉండిపోయారు అనే విషయం బయటకు వచ్చింది.
బిల్ గేట్స్ మిలిందా దంపతులకు ముగ్గురు సంతానం ఉన్నా విషయం తెలిసిందే. అయితే చిన్న కూతురు కి మాత్రం ఇటీవలే 18 ఏళ్లు నిండాయి. ఈ క్రమంలోనే ఎప్పుడో వీరిద్దరూ విడాకులు తీసుకోవాలని అనుకున్నప్పటికీ చిన్నకూతురు 18 ఏళ్లు నిండేంత వరకు ఆగాలని నిర్ణయించుకున్నారట. ఇక ఇటీవల చిన్న కూతురుకి 18 ఏళ్ళు నిండడం తో విడాకులు తీసుకోవాలని భావించి విడాకులతో 27 ఏళ్ల దాంపత్య బంధాన్ని బ్రేక్ చేసినట్లు తెలుస్తోంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త హాట్ టాపిక్ గా మారిపోయింది.