గర్భిణీలు యోగా చేయడం వల్ల కలిగే లాభాలెన్నో ..

Satvika
పెరుగుతున్న కాలుష్యం, మారుతున్న ఆహారపు అలవాట్లు ఇవన్నీ కూడా మనుషుల జీవిత విధానాన్ని ప్రభావితం చేస్తున్నాయి. వీటి నుంచి బయటపడటానికి యోగా అవసరం. యోగా చేయడం వల్ల మనిషికి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలియంది కాదు.. ఇప్పుడున్న దైనందిన జీవితంలో ఈ యోగా అనేది ఖచ్చితంగా అవసరం.. ముఖ్యంగా గర్బీణీలు యోగాలు చేయడం వల్ల పుట్టపోయే బిడ్డకు చాలా మంచిదని నిపుణులు  అంటున్నారు.

గర్భిణీ స్త్రీలు యోగా చేయడం వల్ల కలిగే లాభాలేమిటో ఒకసారి చుద్దాం..

పిండం ఏర్పడిన మూడోనెల నుంచి ప్రత్యేకమైన యోగాలు, వ్యాయామాలు చేయడం వల్ల సీజరీయన్ లేకుండా నార్మల్ డెలివరీ అవుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ప్రత్యేకమైన వ్యాయామాలు, ప్రాణాయామాలు, వజ్రాసనం ఇలా కొన్ని సులభమైన ఆసనాలు వేయడం ద్వారా కడుపులోని బిడ్డ యొక్క అవయవాలు త్వరగా ఏర్పడతాయి. బిడ్డ ఎదుగుదల కూడా బాగా ఉంటుంది.


వీళ్లల్లో బిడ్డ ఎదిగే కొద్దీ మలబద్దకం సమస్య కూడా అధికం అవుతుంది. యోగా చేయడం వల్ల  శరీరం సహకరిస్తుంది. ఉదర సమస్యలు తగ్గి పోతాయి.  దాంతో మలబద్దకం సమస్య కూడా తొలగిపోతుంది. డెలివరీ అయ్యాక సత్వర శక్తీ రావాలంటే ముందు నుంచే యోగాసనాలు చేయడం ఉత్తమం.

 గర్భిణీ స్త్రీలు  ఎక్కువగా వజ్రాసనం వేయడం మంచిదని యోగా నిపుణులు సూచిస్తున్నారు. జీర్ణక్రియ బాగా జరుగుతుంది. ఎక్కువ సార్లు ఊపిరి తీసుకోవడం వల్ల శ్వాసక్రియ వేగంగా జరుగుతుంది. అంతేకాదు ఆకలి వేయడానికి కూడా ఈ ఆసనం ఉయోగపడుతుంది. సుఖ ప్రసవం జరగడానికి ఈ ఆసనం వయోగపడుతుంది.

సరైన ఆహరం తీసుకోవడం కన్నా, సరైన యోగా చేయడం వల్ల తల్లి, బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటారు.. బిడ్డ ఎదుగుదలకు, బ్రెయిన్ డెవెలప్మెంట్ కు ఈ యోగాలు చక్కగా ఉపయోగపడతాయి. చూసారుగా గర్బీణీలు యోగాలు చేయడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. ఇప్పటి నుంచి అయిన యోగాలు చెయ్యండి మీ ఆరోగ్యాన్ని  కాపాడుకోండి.. ఒక గర్భిణీలు మాత్రమే కాదు.. అందరు చేస్తే చాలా మంచిది..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: