శరీర భాగాలతో సరదా వాక్యాలు... మీరూ ఓ లుక్కేయండి ?

VAMSI
మానవ శరీరంలో ఉన్న భాగాలు మనకు ఎంత ముఖ్యమో తెలిసిందే. ఈ శరీర భాగాలలో ఇది లోపించినా సమాజంలో అవతలి వారు చేసే కామెంట్లు మనసును చాలా ఇబ్బంది పెడతాయి. అన్ని శరీర భాగాలు సరిగా ఉంటేనే మనము జీవితంలో ఏ లోటూ లేకుండా సంతోషంగా ఉండగలము. కానీ ఈ ప్రపంచంలో ఎంతో మంది కొన్ని శరీర భాగాలను వివిధ కారణాల చేత పోగొట్టుకుని కూడా వారి జీవితంలో ఎన్నో ఉన్నత స్థానాలను చేరగలుగుతారు. వారు మాకు ఇది లేదని బాధపడరు, ఉన్న శరీర భాగాలతో ఎలా అనుకున్నది సాధించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అటువంటి వాటిని చాలా మంది స్ఫూర్తిని పొందాలి. ఇది ఇలా ఉంటే మన శరీర భాగాల పేర్లను ఉపయోగించి నిత్య జీవితంలో సరదాగా వాడే కొన్ని వాక్యాలు గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాము.
* తల - అప్పు ఇచ్చిన వాడు అడిగే సమయంలో తల తాకట్టు పెట్టయినా నీ బాకీ తీరుస్తా అంటారు.
* గడ్డం - మామూలుగా ఎవరినైనా బ్రతిమాలుకునే సందర్భంలో నీ గడ్డం పట్టుకుంటాను రా...ఈ హెల్ప్ చెయ్యి అని అంటుంటాము.
* ముక్కు - మనము ఎవరికైనా అప్పుగా డబ్బు ఇస్తే, వారు ఇవ్వకుండా మొరాయిస్తే నీ దగ్గర ఎలాగైనా ముక్కు పిండి వసూలు చేస్తాను అంటూ సవాల్ చేస్తాము.
* వీపు - ఎవరైనా మిమ్మల్ని విసిగిస్తూ ఉన్నారంటే, వాటిని రేయ్ ఏంటిది వీపు విమానం మోగిస్తా అంటారు.  
 * కాలు - మీరు ఒక అధికారంలో లేదా ధనవంతులుగా ఉన్నప్పుడు ఉన్న చోటు నుండే అన్ని పనులు జరిగిపోతాయి. ఈ సందర్భంలో మీరు ఇంకొకరికి చెబుతారు.. చూడురా నేను కాలు కదపకుండానే పనులెలా చేయిస్తున్నానో అని..
* చేతులు - సరదాగా మనల్ని ఇంట్లో వారు కానీ, లేదా స్నేహితులు కానీ ఏదైనా ఇమ్మని అడిగినప్పుడు చేతులు ఖాళీ లేవు అని వ్యంగ్యంగా అంటుంటారు.
* అరికాలు - కోపంలో ఉన్నప్పుడు అరికాలు నుండి తలకెక్కుతుంది రా నాకు అని ఆవేశంగా అంటాము.
* పళ్ళు - ఇద్దరి మధ్య వివాదాలు జరుగుతున్నప్పుడు ఒకరినొకరు పల్లు రాలగొడతా అంటుంటారు.
* కళ్ళు - ఒక్కోసారి కోపం పెరిగిపోయినప్పుడు కళ్ళు ఆటోమేటిక్ గా అంటే నిప్పులు పోసుకున్నట్లుగా ఎర్రగా మారిపోతాయి.
* భుజాలు - ఏదైనా విషయంలో ఒక నలుగురిని తప్పు గురించి అడుగుతున్నప్పుడు, వారిలో ఒకరు మాత్రం ముందుగానే నేను చేయలేదు అంటుంటారు. అలాంటి సమయంలో వాటిని గుమ్మడి కాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుముకుంటున్నావు అని అంటాము.
* చెంప - గొడవలు పడే సమయంలో ఇరువురిలో ఒకరు ఎక్కువ కోపానికి లోనైతే చెంప చెల్లుమంటుంది అంటూ ఉంటాము.
* వేలు - కొందరు అవసరం లేకపోయినా పక్కన వారి విషయాలలో కల్పించుకుంటారు. వారిని ఇతరుల విషయములో వేలు పెట్టొద్దు అని అంటూ ఉంటాము.  
* అరచేయి - కొంతమంది ఏమీ లేకపోయినా, గొప్ప గొప్పగా చెబుతూ లేనిపోని ఆశలు కల్పిస్తూ ఉంటారు. ఒకరకంగా చెప్పాలంటే అరచేతిలో వైకుంఠం చూపిస్తూ ఉంటారు.
*  గొంతు - ఒక్కోసారి ఎవరితో అయినా గొడవ పడుతున్నప్పుడు గొంతు మీద కలిసి తొక్కతా కొడకా అంటుంటారు.
* పొట్ట - ఆకలి బాధల సమయంలో ఎదో ఒక పని చేస్తూ ఉంటాము. అప్పుడు పొట్ట కూటికే ఈ పనులన్నీ అని చెబుతూ ఉంటారు.
* నడుము - కొంతమంది పనిలో దొంగలుగా ఉంటారు. అలాంటి వారిని యజమానులుగా ఉండే వారు నడుము వంచి పని చెయ్యిరా అంటూ ఉంటారు.
* నొసలు - మనము కోపంగా ఉన్న సమయంలో నుదురు చిట్లించుకుంటూ ఉండడం అనే అర్ధం లో వాడుతాము.
* నోరు - ఎవరైనా అనవసరంగా మాట్లాడుతుంటే ఊరికే నోరు పారేసుకోకండి అంటాము.
ఇలా మన శరీర భాగాలను సరదాగా వాడుతూ ఉంటాము.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: