ప్రేమ జంటలకు స్వర్గం చిక్‌మగళూరు... "మాన్ సూన్"లో ఒక్కసారైనా చూడాల్సిందే !

Vimalatha
ప్రస్తుతం మాన్ సూన్ సీజన్ నడుస్తోంది. బయట వర్షం పడుతుంటే దాన్ని చూస్తూ వేడివేడిగా కాఫీనో, టీనో తాగుతూ... వేడి వేడి పకోడీ తింటుంటే... ఆ ఎంజాయ్ మెంటే వేరు కదా ! అయితే వర్షంలో బయటకు వెళితే... వర్షంలో బయటకు ఏం వెళతామండీ ? తడుస్తాం, బురద... ఇలాంటి సాకులు చెప్పకండి. మాన్ సూన్ లోనూ మనసును ఆహ్లాదపరిచే ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు మనదేశంలో ఉన్నాయి. ముఖ్యంగా ప్రేమ జంటలకు ఈ మాన్ సూన్ స్వర్గధామం అని చెప్పొచ్చు. అలా సన్నని వర్షంలో తడుస్తూ ఒకరి చేయి మరొకరు పట్టుకుని నడుస్తూ ఉంటే... ఆ ఆనంద క్షణాలను, మధురభూతులను తలచుకుని జీవితాంతం బ్రతికేయొచ్చు.
 
అది కూడా నిజమే కానీ అలాంటి సందర్శనా స్థలాలు ఎక్కడ ఉన్నాయి ? ప్రయాణం, ఖర్చులు వంటి విషయాలను గురించి ఆందోళన పడకండి, ఆ వివరాలను మీ కోసం మా ఇండియా హెరాల్డ్ లో అందిస్తున్నాము. ఇలాంటి రోజుకో అప్డేట్ తో మీకు అన్ని వివరాలు అందించేందుకు మేము సిద్ధం. మాన్ సూన్ ను ఎంజాయ్ చేయడానికి మీరు కూడా రెడీ అవ్వాల్సిందే. ప్రతి రోజూ "ఇండియా హెరాల్డ్"లో వచ్చే ఈ అప్డేట్ లతో మీరు వెళ్లాలన్న ప్లేస్ గురించిన వివరాలను తెలుసుకోండి. ట్రిప్ ను హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఇప్పుడు మనం కర్ణాటకలోని చిక్‌మగళూరు గురించి మాట్లాడుకుంటున్నాము. చిక్ మగళూరు కర్ణాటక రాష్ట్రంలోని అత్యంత ప్రసిద్ధ కాఫీ ల్యాండ్‌లలో ఒకటి. కర్ణాటకలోని ఎత్తైన శిఖరం, హెబ్బే జలపాతం అద్భుతంగా ఉంటాయి.
చిక్‌మగళూరు - కర్ణాటక (22.6 ° C)
చిక్‌మగళూరు.. కర్ణాటకలో అత్యంత ప్రశాంతమైన, పచ్చని నగరాలలో ఒకటి. పశ్చిమ కనుమలలోని ముల్లాయనగిరి శిఖరం దిగువన ఉన్న ఈ ప్రదేశం విస్తారమైన ఉష్ణమండల వర్షారణ్యానికి నిలయంగా ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులను తన అందాలతో ఆకర్షిస్తుంది. భారతదేశంలో వర్షాకాలంలో సందర్శించడానికి అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రదేశాలలో ఇది కూడా ఒకటి. కర్ణాటక అంటే ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల ప్రజలకు అందుబాటులో ఉంటుంది. హనీమూన్‌లు చేసుకునే కొత్త జంట, ప్రేమికులు, కుటుంబాలు ఇక్కడ సరదాగా సందర్శించవచ్చు.
తప్పకుండా చూడాల్సినవి, చేయాల్సినవి : సందర్శనా స్థలాలు, ట్రెక్కింగ్, క్యాంపింగ్, ప్రకృతిలో నడక
ఎలా చేరుకోవాలి : ఈ ప్రదేశానికి బెంగళూరు, మంగళూరు నుండి రోడ్డు ద్వారా చేరుకోవచ్చు. బస్సులో, కార్లో, బైక్ లో ఎలాగైనా వెళ్లొచ్చు. మీ ఓపిక, బడ్జెట్ ను బట్టి ఎలా వెళ్లాలో ఎంపిక చేసుకోండి.
ప్రత్యేక ఆకర్షణలు : సహజ సౌందర్యం, భౌగోళిక ప్రాముఖ్యత
ప్యాకేజీ : రూ.12,000 ఖర్చు అవుతుందని అంచనా. ఇది కుటుంబ సభ్యులను బట్టి, వ్యక్తులను బట్టి మారే ఛాన్స్ ఉంటుంది.
ఉండడానికి హోటల్స్ : చిక్‌మగళూరు హోమ్‌స్టే, వింటేజ్ చిక్‌మగళూర్
ప్రత్యేకతలు :
వర్షాకాలంలో చిక్‌మగళూరులో హస్తకళల వాతావరణం, రుతుపవనాల సమయంలో భారీ వర్షపాతం, 22.6 ° C సగటు ఉష్ణోగ్రతతో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: