లైఫ్ స్టైల్ : గాజులు దేనికి శుభసూచకం..
సరిగ్గా చెప్పాలి అంటే హిందూ శాస్త్రం ప్రకారం ప్రతి ఒక్కటి ఒక ప్రత్యేకతను కలిగి ఉండడమే కాకుండా, సైన్స్ పరంగా కూడా తప్పకుండా రీజన్ కలిగి ఉంటుంది.. మహిళలు ధరించే గాజులు మట్టి గాజులు అయితే మరీ మంచిదట . ఆ ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుందని పెద్దలు విశ్వసిస్తారు. ఇక అంతే కాదు చేతినిండా గాజులు వేసుకుని ఇంట్లో ఆడపిల్ల శబ్దం చేస్తే , ఇంట్లో అష్టైశ్వర్యాలు ఎప్పుడు తుల తూగుతూనే ఉంటాయట. అంతే కాదు ఆ ఇల్లు అనురాగాలు, ఆప్యాయతలకు కొలువు అవుతుందట. ఈ గాజులు ధరించడం వల్ల మణికట్టు మీద ఉన్న నాడీ కణాలు ఉత్తేజితమై ,మెదడు చురుకుగా పని చేయడమే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉండడానికి ఈ గాజులు ఎంతగానో సహాయం చేస్తాయట.
హిందూ సాంప్రదాయం ప్రకారం పుట్టిన బిడ్డకు నల్లటి గాజులు వేయడం వల్ల, వారికి ఇతరుల దృష్టి నుండి రక్షణ కలుగుతుందని పండితులు సూచిస్తున్నారు. అంతేకాదు సౌభాగ్యానికి ప్రతీకగా ఈ గాజులను ధరించడం ఆనవాయితీ. ఆకుపచ్చ రంగులు ధరించడం వల్ల భర్త నిండు నూరేళ్లు జీవిస్తాడు అని , పరమేశ్వరుని ఆశీర్వాదం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అందుకే చాలా వరకు పచ్చని గాజులను ధరించడానికి
ఎక్కువ మక్కువ చూపించాలి. కాబట్టి ఇక నుంచైనా శాస్త్రం కాకుండా సైంటిఫిక్ గా కూడా కూడా మనకు ఆరోగ్యాన్నిచ్చే ఈ మట్టి గాజులను వేసుకోవడానికి ప్రయత్నం చేయండి.