లైఫ్ స్టైల్ : మీ ఇంట్లో ఈ చెట్టు ఉంటే బంగారం ఉన్నట్టే ..!
సాధారణంగా మందారం మొక్క యొక్క ఆకులు, పువ్వులు కొన్ని మనకు సౌందర్య సాధనాల తో పాటు ఆరోగ్యంగా కూడా ఉపయోగపడతాయి. మందారం ఆకులను మెత్తగా నూరి కేశాలకు పట్టించి నట్లయితే, తలలో ఉండే పేను, అధికంగా జుట్టు రాలడం, జుట్టు తెల్లబడడం, చుండ్రు వంటి అనేక జుట్టు సంబంధిత సమస్యలను దూరం చేసుకోవచ్చు. అంతేకాదు ముఖం మీద మొటిమలు ఎక్కువగా ఉన్నప్పుడు మందారమాకు ను మెత్తగా నూరి వారానికి ఒకసారి పట్టించినట్లయితే ముఖం మీద వున్న మొటిమలు కూడా దూరం అవుతాయి.
ఇక అధికబరువు ఉన్నవాళ్లు మందారం టీ కూడా చేసుకుని తాగితే మంచి ఫలితాలు ఉంటాయి. అయితే ఇందుకోసం ఒక రెండు మందారం పూలను తీసుకొని నీళ్లలో వేసి బాగా మరిగించాలి. ఈ నీటిని వడగట్టి ఉదయం పూట సేవించడం వల్ల అధిక బరువు తగ్గవచ్చని నిపుణులు కూడా సూచిస్తున్నారు. ఈ మందారం టీ చేసుకొని తాగడం వల్ల మనలో ఆకలి సహజంగా తగ్గిపోయి, రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందట. అంతేకాదు విటమిన్ సి కూడా మన శరీరానికి పుష్కలంగా లభిస్తుంది. ఎప్పుడైతే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందో అప్పుడు సహజంగానే మన శరీరంలోకి ప్రవేశించే వైరస్ ను, మంచి బ్యాక్టీరియా అడ్డుకుంటుంది. తద్వారా ఆరోగ్యంగా కూడా ఉండవచ్చు.