లైఫ్ స్టైల్: ఈ మొక్కలు మన ఇంటి లోపల పెంచరాదు..?

Divya
ఇంటిని అందంగా అలంకరించుకోవడం కోసం మనం ఇంటి చుట్టూ కొన్ని మొక్కలను నాటుతూ ఉంటాము. ఇలా నాటడం వల్ల మొక్కలు మనం చూసినప్పుడల్లా ఎంతో ప్రశాంతతను చేకూరుస్తాయి. ఇక మొక్కలు ఇంటి పరిసరాలు చుట్టూ ఉండడం వల్ల స్వచ్ఛమైన ఆక్సిజన్ ను అందిస్తాయి. అయితే ఇంటి ఆవరణంలో కొన్ని మొక్కలను పెంచకూడదట. ఆ మొక్కలు ఏవేవో చూద్దాం.
1). చింత చెట్టు:
ఈ చెట్టు వల్ల మనకు చింతాకు, చింతపండు లభిస్తూ ఉంటాయి. అయితే ఈ మొక్కను ఇంట్లో ఆవరణం లో నాటడం వల్ల  ఆనందంగా ఉండలేరు అన్నట్లుగా కొంతమంది నిపుణులు తెలియజేస్తున్నారు. అంతే కాకుండా మన అభివృద్ధి ని దెబ్బ తీస్తుందట.

2). బాదం చెట్టు:
ఈ బాదం చెట్టు కాయలు వల్ల మనకు బాదం లభిస్తుంది. కానీ చెట్టు ఇంటి దగ్గర ఉండడం వల్ల ఎక్కువ బాధలు వస్తాయని అన్నట్లుగా కొంతమంది తెలియజేస్తున్నారు.

3). తాటి చెట్టు:
కొంతమంది నిపుణులు తెలియజేసిన ప్రకారం తాటి చెట్టు ఎప్పుడూ ఇంటి ఆవరణంలో ఉండకూడదు. ఇది ఉండడం వల్ల లక్ష్మీదేవి మన దగ్గరకు దరిచేరదట. అంతేకాకుండా ఆర్థిక సమస్యలు, ఆరోగ్యంపై ప్రభావం కూడా తలెత్తడం  జరుగుతాయి.

4). వెదురు చెట్లు:
ఈ వెదురు మొక్కలను చాలా మంది తమ ఇంటి చుట్టూ ఆవరణంలో పెంచుతూ ఉంటారు. కానీ ఈ వెదురు చెట్లను పెంచకూడదు అని కొంతమంది తెలియజేస్తున్నారు. హిందూ శాస్త్రం ప్రకారం ఇవి మరణించిన వ్యక్తిని కాల్చడానికి మాత్రమే ఉపయోగిస్తారు అన్నట్లుగా తెలియజేస్తున్నారు.

5). రావి చెట్టు:
ఈ మొక్కలను ఎక్కువగా దేవాలయాల్లో పెంచుతారు అందుచేతనే మన ఇంట్లో రావి చెట్టు ఉండడం వల్ల నష్టం జరుగుతుందని కొంతమంది నిపుణులు తెలియజేస్తున్నారు.

ఇక ఇవే కాకుండా మరికొన్ని మొక్కలు కూడా మన ఇంటి చుట్టూ ఉండకూడదని తెలియజేస్తున్నారు. కాబట్టి పొరపాటున మీ ఇంటి దగ్గర ఇలాంటి చెట్లు ఉన్నట్లయితే వెంటనే తొలగించండి.కాబట్టి ఎవరు ఈ చెట్లను పెంచుకోవద్దు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: