లైఫ్ స్టైల్: నిల్వ ఉంచిన పిండిలో పురుగులు పడుతుంటే ఇలా చేయండి..?

Divya
సాధారణంగా ప్రతి ఒక్కరూ ఇంటికి సరిపడా సరుకులను దాదాపుగా నెల ముందే తెచ్చి పెట్టుకుంటారు. ఎందుకంటే ప్రతి సారి సరుకులు అయిపోయినప్పుడల్లా..బయటకు వెళ్లి తెచ్చుకోవడం అంటే చాలా కష్టం కాబట్టి.. నెలవారీ సరుకులు తెచ్చుకుని ఇంట్లో నిల్వ చేసుకుంటారు. అలా నిల్వ చేసుకున్న వాటిలో ఇటీవల పురుగుల బెడద ఎక్కువ అవుతోందని పలువురు గృహిణిలు వాపోతున్నారు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే , పిండి లో లేదా మరే ఇతర వస్తువులలో పురుగులు చేరినా వాటిని ఇట్టే తొలగించవచ్చు..అదేంటో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసు కుందాం..

మనం ఏదైనా పిండి ని సాధారణంగా కవర్, బ్యాగ్ లలో నిల్వ ఉంచడం చేస్తూ వుంటాము. అలా నిల్వ  ఉంచకుండా వాటిని కవర్ నుంచి తీసి, స్టీల్ డబ్బాలలో నిల్వ ఉంచుకోవాలి. అయితే ముందుగా డబ్బాలను తడి లేకుండా ఆరబెట్టి , ఆ తర్వాత పిండిని నిల్వచేసుకొని, మూత గట్టిగా పెట్టేయాలి.. అంటే గాలి చొరబడకుండా డబ్బాలో పిండి నిల్వ చేసుకోవడం వల్ల.. అందులో ఎటువంటి పురుగులు కానీ బగ్స్ కానీ చేరవు. ఇక ఎక్కువ రోజులపాటు నిల్వ ఉంచాలి అంటే దాదాపు పది కేజీల గోధుమపిండి కి నాలుగు టేబుల్ స్పూన్ల చొప్పున కలిపి నిల్వ ఉంచితే పిండి లో పురుగులు చేరకుండా ఉంటుంది.

ఇక మిగతా పదార్థాల విషయానికి వస్తే, ఎండు మిర్చి లేదా బిర్యానీ ఆకులను కూడా కలపవచ్చు. ముఖ్యంగా బిర్యానీ ఆకులను కొంచెం పిండిలో బాగా కలిసేటట్టు కలపాలి. లేదా ఎండుమిర్చి గింజలు పిండిలో కలవకుండా జాగ్రత్తపడుతూ పిండిలో 10 నుంచి 12 ఎండు మిర్చి ని కలపడం వల్ల పురుగు చేరకుండా ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది..

చూశారు కదా..! మీ ఇంట్లో కూడా ఇలాంటి సమస్య ఉన్నట్లయితే ఇప్పుడు చెప్పిన చిట్కాలు పాటించి త్వరగా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: