లైఫ్ స్టైల్: వంటింట్లో ఉండే ఈ నూనెతో మసాజ్ చేస్తే.. ఇట్టే బరువు తగ్గొచ్చు..!!

Divya

చాలా మంది అధిక బరువును తగ్గించుకోవడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.. అలాంటి వారు ఇప్పుడు చెప్పబోయే ఈ చిన్న చిట్కా పాటించి అధిక బరువును తగ్గించడానికి ఒకసారి ప్రయత్నం చేయండి.. ముఖ్యంగా ఆయుర్వేద నిపుణులు మనతో కొన్ని పద్ధతులను షేర్ చేసుకుంటున్నారు. వీటిని కనుక మీరు అనుకరించినట్లయితే తక్కువ సమయంలోనే బరువును తగ్గించుకోవచ్చు.

ఉదాహరణకు బరువు తగ్గించడం కోసం ఆయుర్వేద నిపుణులు కొన్ని పద్ధతులతో పాటు టెక్నిక్స్ ను కూడా పంచుకున్నారు.. వీటిలో ముఖ్యమైనది ఉద్వర్తనం కూడా ఒకటి.. ఈ పద్ధతిలో కొంచెం మూలిక పొడిని, నూనెలో కలిపి ఉపయోగించమని ఆయుర్వేద నిపుణులు సలహా ఇస్తున్నారు.. ఇకపోతే ఈ ఆయుర్వేద థెరపీ నీ కనుక మీరు ఉపయోగించినట్లయితే ,కొవ్వు కరిగి శరీరం గట్టిపడుతుందట. అయితే దీని గురించి ఒకసారి తెలుసుకుందాం..
ఆయుర్వేద నిపుణులు తెలిపిన ఈ థెరపీని అనుసరించడం వల్ల శరీరంలో ఉన్న కొవ్వు కరిగి, సులభంగా శరీరం గట్టిపడుతుంది. అయితే ఈ ఆయుర్వేద మూలిక ఎలా పని చేస్తుంది అనేది గనుక గమనించినట్లయితే.. ఈ పేస్ట్ ను గోరువెచ్చగా చేసి మన శరీరంపై అప్లై చేసేటప్పుడు ఇద్దరు థెరపీస్ట్ లు ఈ పేస్ట్ ను మన శరీరం  పై అప్లై చేయడం జరుగుతుంది. వీరు ఈ మసాజ్ చేసేటప్పుడు 7 భంగిమలలో ఉండాలి. మన శరీరంపై ఉండే జుట్టుకు వీరు వ్యతిరేక దిశలో ఈ పేస్ట్ ను అప్లై చేసి,  మసాజ్ చేస్తారు.. ఒకసారి ప్రొసీజర్ మొత్తం అయిపోయిన తర్వాత అరగంట పాటు రెస్ట్ తీసుకోవాలి..

తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి.. ఒత్తిడి భంగిమల వల్ల నెమ్మదిగా కొవ్వు కరిగి బరువు తగ్గుతారు.ఈ  పద్ధతిని పాటించడం వల్ల శరీరంలో ఉండే పిత్త , వాత బ్యాలెన్స్ గా ఉంటాయి.. అదేవిధంగా శరీరం గట్టిపడి శరీరంలో ఉన్న కొవ్వు కరుగుతుంది.. అంతే కాదు శరీరం యొక్క నాణ్యత కూడా పెరుగుతుంది అని వైద్యులు కూడా చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: