లైఫ్ స్టైల్: దగ్గు తగ్గించే సిరప్ ను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చట..!
దగ్గు సిరప్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు..
కొద్దిగా అల్లం, 2 టేబుల్ స్పూన్ తేనె, రెండు నిమ్మకాయలు, నీళ్ళు..
తయారీ విధానం:
అల్లంను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.. నిమ్మకాయల కట్ చేసి వాటిని నుండి రసం తీసి, నిమ్మకాయ తొక్కలను జెస్టర్ సహాయంతో చిన్నగా తురమాలి. ఒక పాన్ తీసుకొని, స్టౌ మీద పెట్టి అందులో ఒక కప్పు నీరు పోయాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొన్న అల్లం ముక్కలను, ఒక పావు కప్పు ఆ నీటిలో వేయండి. ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల తరిగిపెట్టుకున్న నిమ్మకాయ తొక్కల పొడిని అందులో కలపండి. ఐదు నుంచి పది నిమిషాలు ఈ మిశ్రమాన్ని తక్కువ మంటపై స్టవ్ మీద బాగా మరిగించి, ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి.
ఇక ఈ ద్రావణం చల్లగా అయిన తర్వాత వడకట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక చిన్న పాన్ తీసుకొని అందులో ఒక కప్పు తేనె వేసి, కొద్దిగా వేడి చేయండి. తేనె వేడిగా అయిన తరువాత పక్కన పెట్టుకున్న ద్రావణాన్ని అందులో కలిపి బాగా మిక్స్ చేయాలి. ఇక ఇందులో ఇప్పుడు పక్కన పెట్టుకున్న నిమ్మరసాన్ని బాగా కలపండి. లో ఫ్లేమ్ మీద కొద్దిగా కలుపుతూ తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. అంతే దగ్గును తగ్గించే సిరప్ రెడీ అయినట్టే..
ఒకటి నుండి పన్నెండు సంవత్సరాల వయసు ఉన్న పిల్లలు రెండు గంటలకు ఒకసారి ఆఫ్ టేబుల్ స్పూన్ ఇది తాగితే సరిపోతుంది. పెద్దవారు నాలుగు గంటలకు ఒకసారి ఒక టేబుల్ స్పూన్ ఈ సిరప్ తాగితే త్వరగా దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది.