లైఫ్ స్టైల్: డి విటమిన్ కావాలంటే ఎండలో ఎంత సేపు ఉండాలో తెలుసా..?
డి విటమిన్ మనకు టాబ్లెట్ రూపంలో కాకుండా సహజంగా లభించాలి అంటే సూర్యరశ్మి నుంచి పొందవచ్చు అని అందరికీ తెలిసిన విషయమే. విటమిన్-డి ఉంటేనే మన శరీరంలో ఎముకలు దృఢంగా తయారవుతాయి.. దంతాలు కూడా ఆరోగ్యంగా ఉండటానికి సహాయ పడతాయి. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి అంటే విటమిన్-డి చాలా అవసరం. విటమిన్-డి లోపం వల్ల ఎలాంటి నష్టాలు కలుగుతాయి అనే విషయానికి వస్తే శారీరక సమస్యలతో పాటు మానసిక సమస్యలు కూడా ఏర్పడతాయట.ఎలా కనుక్కోవచ్చు అనే విషయానికి వస్తే బ్లడ్ టెస్ట్ ద్వారా కూడా విటమిన్-డి లోపాన్ని తేలికగా మనం కనుక్కోవచ్చు
కొంత మంది రీసెర్చర్లు నాలుక ద్వారా కూడా విటమిన్-డి లోపాన్ని గుర్తించవచ్చు అని తెలిపారు.. నోట్లో.. నాలుక నొప్పి కలగడం లేదా మంటపుట్టడం , రుచి తెలియకపోవడం, నోరు వాచిపోవడం , సరిగ్గా మాట్లాడలేక పోవడం వంటి ఇబ్బందుల వల్ల మనకు విటమిన్-డి లోపం కలిగిందని తెలుసుకోవచ్చట. శరీర తత్వాన్ని బట్టి విటమిన్-డి లోపం తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు సూర్యకిరణాలలో ఎంత సమయం ఉండాలి.. ఎప్పుడు ఉండాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
ఇక 70 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వాళ్ళకి విటమిన్-డి 600 iu అయ్యుండాలి. 70 సంవత్సరాల పైబడిన వారు అయితే 800 iu డి-విటమిన్ ఉండేలా చూసుకోవాలి. ఇక ప్రతి రోజూ ఉదయం 10 నిమిషాల నుండి 20 నిమిషాల వరకు ఎండలో ఉంటే సరిపోతుంది. 7 గంటల నుండి ఎనిమిది గంటల లోపు వచ్చే సూర్యకిరణాలను ఆస్వాదించడం వల్ల మనలో డి విటమిన్ లోపం ఉండదు అని వైద్యులు చెబుతున్నారు.