లైఫ్ స్టైల్: అసలు ఇంటి మూలల్లో ఏముంది..?
లైటింగ్ అరేంజ్ చేయడం:
సాధారణంగా ఇంటి మూలలకి పెద్దగా లైటింగ్ రాదు..ఆ ఏరియాలో కొంచెం డార్క్ గా ఉండటం మనం గమనించే ఉంటాం.. మీ ఇంట్లో మూలలలో కూడా అలాగే డార్క్ గా కనిపిస్తూ ఉంటే ఒక చిన్న టేబుల్ వేసి ఒక మంచి టేబుల్ ల్యాంప్ దానిపైన అరెంజ్ చేయండి.. లేదా ఫ్లోర్ లాంప్ అయినా కూడా మీరు ఉపయోగించుకోవచ్చు.. ఒకవేళ మీరు టేబుల్ ల్యాంప్ కనుక ఉపయోగించుకోనట్లయితే, ఆ ల్యాంప్ చుట్టూ కొన్ని ఫ్లవర్స్ కూడా పెట్టండి.. చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది..
మరొక కుర్చీ వేసుకోవడం:
సాధారణంగా కార్నర్ ను ఎలా వాడుకోవాలి అనేది మన రూమ్ ని బట్టి మారుతుంది.. లివింగ్ రూమ్ లో అయితే మూలల్లో ఇంకొక కుర్చీ వేయండి.. ఒకవేళ మీ తాతగారు లేక బామ్మగారి పడక్కుర్చీ ఉంటే దానికి.. మీ ఫర్నిచర్ కి సరిపోయే కలర్ వేసి, నీటిగా కుషన్స్ కూడా వేసి మూలలో సెట్ చేయండి.. మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వారికి కొన్న చిన్న కుర్చీలు కూడా మీరు అక్కడ వేసుకోవచ్చు. చిన్న కుర్చీలలో ఒక టెడ్డీబేర్ ని పెట్టేస్తే చాలా అద్భుతంగా కనిపిస్తుంది.
మొక్కల కుండీలు పెట్టడం:
ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో రకాల ఇండోర్ ప్లాంట్ లభిస్తున్నాయి.. కాబట్టి మీ టేస్ట్ కి , మీ ఇంటికి తగ్గట్టుగా ప్లాంట్స్ తెచ్చుకొని, ఇంటి మూలల్లో పెట్టేస్తే సరిపోతుంది.. ఇంటికి చక్కని కల రావడంతో పాటు ఫ్రెష్ ఆక్సిజన్ కూడా లభిస్తుంది.
మూలల్లో ఏముంది అనే కన్నా ఇలాంటివి అరేంజ్ చేసి చూడండి మీ ఇల్లు చాలా అద్భుతంగా కనిపిస్తుంది.