లైఫ్ స్టైల్: పాల ప్యాకెట్ కవర్లను పడేసేముందు ఇలా చేసి చూడండి..!!
అలా పడేసే ముందు ఈ పాల ప్యాకెట్లను రీసైకిల్ చేసి పర్యావరణ అనుకూల పద్ధతిలో కూడా మనం తయారు చేసుకోవచ్చు.. అది ఎలానో ఒకసారి మనం ఇప్పుడు చూసి తెలుసుకుందాం..
పాల ప్యాకెట్ కవర్లు తీసేసిన తర్వాత వీటిని వేడి నీటిలో మడిచి పెట్టాలి.. ఇలా చేయడం వల్ల పాల ప్యాకెట్ నుంచి వచ్చే వాసన రాదు.. ఇక ఈ మధ్య కాలంలో మిల్క్ ప్యాకెట్లు చాలా మంచి నాణ్యత కలిగిన కవర్ తో వస్తున్నాయి కాబట్టి వీటిని వేడి నీటితో కడిగిన తర్వాత ఆహారపదార్థాలను పెట్టుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు..ఫ్రిజ్లో పెట్టుకునే పచ్చి బఠాణీలు, పచ్చిమిర్చి, వేయించిన కొబ్బరి, కరివేపాకు వంటి కూరగాయలు కూడా నిలువ చేస్తూ ఉంటారు కాబట్టి వీటిని ఈ పాల ప్యాకెట్ కవర్లో పెట్టుకుని నిల్వ చేసుకోవచ్చు.
ముఖ్యంగా గడ్డకట్టి ఉంచాల్సిన కొన్ని ఆహార పదార్థాలను కూడా ఈ ప్యాకెట్లలో నిలువ చేసుకోవచ్చు. నీటిని నిల్వ చేయడం వల్ల అవి ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.. చాలామంది తోటపని , ఇంటిపని చేసేటప్పుడు చేతులు మురికిగా మారుతాయి కదా.. అప్పుడు చేతి తొడుగులు లేని సమయంలో కూడా వీటిని ఉపయోగించుకోవచ్చు. అంతేకాదు ప్రస్తుతం వస్తున్న పాల ప్యాకెట్లు వాటర్ ప్రూఫ్ కాబట్టి హెడ్సెట్, సెల్ఫోన్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా మీరు వీటిలో భద్రపరుచుకోవచ్చు.