లైఫ్ స్టైల్ : ఇంట్లో ఉండే దరిద్రం పోవాలంటే ఇలా చేయండి..!!
ఇకపోతే భారతీయ వేదాలలో వాస్తుశాస్త్రం అత్యంత ప్రాముఖ్యత సంపాదించుకుంది. ఇంట్లో ఆనందం, శాంతి ,ఆరోగ్యం ,ఐశ్వర్యం వంటివి రావాలి అంటే తప్పకుండా కొన్ని వాస్తు సూత్రాలు పాటించి తీరాలి. తద్వారా ఇంట్లో మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇంట్లో కి వచ్చే మెయిన్ డోర్ చాలా శుభ్రంగా ఉండాలి . ఎప్పుడు క్లీన్ గా ఉండేలా నిరంతరం చూసుకుంటూ మనం జాగ్రత్త వహించాలి. విండ్ చిమ్స్ అనేవి చిన్న గాలి వచ్చినా అటూ ఇటూ కదులుతూ ఉంటాయి. కాబట్టి మంచి శబ్దాలు చేస్తాయి. ఈ శబ్దాలు నెగటివ్ ఎనర్జీ ని ఆపి వేస్తాయి. బయట నుంచి ఇంట్లోకి గాలి వచ్చే చోట ఈ విండ్ చిమ్స్ ను ఏర్పాటు చేయండి.
ఇక ఉప్పు చాలా పవర్ఫుల్ అన్న విషయం చాలామందికి తెలియదు. కానీ ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీని పీల్చే శక్తి ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అందుకే ఒక గిన్నెలో గుప్పెడు ఉప్పు వేసి గదిలో ఒక మూల ఉంచడం వల్ల మంచి శుభ ఫలితాలు కలుగుతాయి.