లైఫ్ స్టైల్:ఒమిక్రాన్ అయినా సరే..వంటింటి చిట్కాలతో పరార్..!!
ప్రస్తుతం శీతాకాలం కావడంతో అందరికీ ఎక్కువగా దగ్గు, జలుబు గొంతు నొప్పి వంటివి రానే వస్తూ ఉంటాయి. ఇక ప్రస్తుతం ఇలాంటి లక్షణాలే ఒమిక్రాన్ లక్షణాలు కూడా ఒకేలా కనిపిస్తూ ఉన్నాయి.. ఇక ఇలాంటి సమయంలోనే రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు ఇంటి వైద్యం చాలా బాగా ఉపయోగపడుతుందట.. శరీరంలోకి ఎలాంటి బ్యాక్టీరియా వైరస్ వంటివి సోకకుండా.. శ్లేష్మం ఒక రక్షిత పొరగా ఉంటుంది.. ఇక ఈ పొర మందమైనప్పుడే మనకి సమస్యలు ఎదురవుతాయట. అయితే ఇది ఇలా కావడానికి ముఖ్యంగా పాల ఉత్పత్తులు ఎక్కువగా మనం తీసుకున్నప్పుడే ఇలా జరుగుతుంది. అందుచేతనే మనం ఎక్కువగా అల్లం టీ, లెమన్ టీ వంటి వాటితో ఇలాంటి వాటికి చెక్ పెట్టవచ్చు.
ఇక గొంతు నొప్పి తో ఇబ్బందిపడేవారు ఉప్పు నీటిని కలుపుకొని పుక్కిలించడం చాలా మంచిదట. రోజులో కనీసం మూడు సార్లైనా ఇలా చేస్తే గొంతు నొప్పి తగ్గిపోతుందని సలహా ఇస్తున్నారు కొంతమంది వైద్యులు.
ఇక పసుపు మనకి దివ్యౌషధంగా పనిచేస్తుంది.. కాసిన్ని పాలలో పసుపు పొడిని వేసుకుని తాగితే.. శ్లేష్మం చాలా ఆరోగ్యకరంగా ఉంటుందట.
పుదీనా, సొంటి, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్కతో చేసినటువంటి నీరు తాగడం వల్ల రోగనిరోధక శక్తి సమృద్ధిగా పెరుగుతుందట. ఇక ఇలాంటి వాటితో మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.