లైఫ్ స్టైల్: పిల్లలు అన్నం తినకుండా మారాం చేస్తున్నారా.. అయితే ఇలా చేయండి..!!
1). వాము:
గ్యాస్, ఎసిడిటీ వంటి వాటి ద్వారా కడుపునొప్పి వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. జీర్ణ వ్యవస్థ మెరుగుపడడానికి వాము బాగా ఉపయోగపడుతుంది. అందుచేతనే పిల్లల ఆహారంలో ఈ వాము ఉండేలా చూసుకోవాలి.
2). యాలకుల పాలు:
యాలకలను పాలలో వేసి బాగా మరిగించి పిల్లలచేత తాగించడం మంచిది. దీనివల్ల జీర్ణం బాగా అవుతుంది.
3). ఉసిరి కాయలు:
ఈ ఉసిరికాయలను అప్పుడప్పుడు బాగా పిల్లలకు తినిపించడం వల్ల.. కంటి చూపు మెరుగు పరచడంతో పాటు శరీరంలో ఉండే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వీటిని తినడం వల్ల పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటారు.
4). చింతపండు:
చింతపండు లో ఎక్కువగా భేదిమందు మూలకాలు కలిగి ఉంటాయి.. ఇక దీంతో చట్నీ వంటివి చేసి పిల్లలకు ఆహారంలో వడ్డించాలి. దీంతో ఆకలి బాగా వేస్తుంది.
5). సొంపు:
పిల్లలకు బాగా ఆకలి వేస్తుంది అప్పుడు సోంపు గింజలను తినిపించడం వల్ల ఆకలి ఎక్కువగా వేయదట. అంతేకాకుండా వీటి నుంచి షుగర్ లెవెల్స్ తక్కువగా ఉండడం వల్ల పిల్లలు ఉత్సాహంగా ఉంటారు. దీంతో ఆకలిని పెంచుతూ ఉంటుంది.కాబట్టి తల్లిదండ్రులు మీ పిల్లల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది..