వండర్‌ వరల్డ్‌: కుక్కల కోసం అదిరిపోయే లగ్జరీ హోటల్..?

పెంపుడు కుక్కలంటే ఎంతో మంది ప్రేమ చూపిస్తారు.. వాటిని తమ కుటుంబ సభ్యుడిలా చూసుకుంటారు. పెంపుడు కుక్కల కోసం ప్రాణం ఇచ్చేంతగా ప్రేమించే వారూ ఉంటారు.. అందుకే ఇప్పుడు ఆ కుక్కల కోసం అనేక విలాసాలు అందుబాటులోకి వచ్చేశాయి.. ధనవంతుల కుక్కల కోసం అనేక సదుపాయాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వాటి ఫుడ్‌, పెంపకం, సౌకర్యాలు అబ్బో ఇలా చాలా మార్కెట్ విస్తృతం అవుతోంది.


అయితే.. దక్షిణాఫ్రికాలో మాత్రం ఏకంగా కుక్కల కోసం ఓ లగ్జరీ హోటలే ఉంది. ఈ లగ్జరీ హోటల్ వివారాలు తెలుస్తే మాత్రం.. ఆహా ఆ కుక్కల బతుకు ఎంతో బెటర్ అంటూ ఆశ్చర్యపోతాం.. సాధారణంగా అత్యంత విలాసవంతమైన హోటళ్లను ఫైవ్ స్టార్ హోటల్స్ అంటాం.. ఆ హోటల్ అందించే సౌకర్యాలను బట్టి ఈ స్టార్స్ ఉంటాయి.. ఫైవ్‌ స్టార్ హోటల్ అంటే సూపర్ లగ్జరీ అన్నమాట..కానీ ఇప్పుడు మనం చెప్పుకునే ఈ హోటల్ మాత్రం అంతకు మించి అన్నమాట.. అంటే ఇది సిక్స్ స్టార్‌ హోటల్‌ అట.


దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో ఉందీ  సిక్స్ స్టార్ డాగ్స్ లగ్జరీహోటల్.. దీని పేరు సూపర్‌వూఫ్‌. ఈ హోటల్ ప్రత్యేకతలు ఏంటంటే.. ఇందులో పెంపుడు కుక్కలకు ఈ హోటల్‌లో 24 గంటల పర్యవేక్షణ ఉంటుందట.. ఈ కుక్కలకు స్నానం, గ్రూమింగ్‌ చేయిస్తారు.. ఈ కుక్కలకు ప్రత్యేకంగా పళ్లు కూడా తోమిపెడతారు.. వాటి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేస్తారు.. అనేక పరీక్షలు కూడా నిర్వహించి వైద్య పరమైన సలహాలు కూడా ఇస్తారట. అంతే కాదు.. ఆరోగ్యం కూడా ఇక్కడే కుక్కలకు టీకాలు కూడా వేస్తారు.



ఇక ఈ హోటల్‌లో కుక్కల సందడి అంతా ఇంతా కాదు.. ఈ కుక్కల కోసం డిజైనర్‌ వేర్‌ దుస్తులు కూడా రూపొందిస్తారట. వీటి కోసం స్పెషల్ ఫుడ్‌ ఎరేంజ్‌ మెంట్స్ ఉంటాయి. ఇక్కడ ఎంత ప్రత్యేకం అంటే.. ఈ కుక్కలు తాగే నీరు కూడా  ప్రత్యేక మూలికలు కలిపిన తయారు చేస్తారట. ఈ హోటల్‌లో అడుగు పెట్టాలంటే ముందుగా టీకాలు వేయించాలట. అలాంటి వాటికే ఈ హోటల్‌లోకి  ప్రవేశం కల్పిస్తారట. ఇలా ఈ హోటల్ ప్రత్యేకతలు అన్నీ ఇన్నీ కావు.. ఇప్పుడు చెప్పండి.. ఈ స్టోరీ చదివాక మీరు ఎవరినైనా ఏంట్రా కుక్క బతుకు అని తిడతారా.. నెవర్‌ కదా.. అదీ సంగతి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: