లైఫ్ స్టైల్: కూల్ వాటర్ తో సైడ్ ఎఫెక్ట్స్.. నిజమేనా..?

Divya
ప్రస్తుతం మాగమాసం నడుస్తోంది.. మరొక 15 రోజుల్లో ఫాల్గుణ మాసం కూడా మొదలవబోతోంది.. మండే ఎండలు కూడా మొదలవుతాయి అని అర్థం.. అందుకే కాసిన్ని చల్లటి నీరు గొంతులో పోసుకుంటే దప్పిక తీరుతుంది అని చాలామంది కూల్ వాటర్ తాగడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఇక ఈ మధ్యకాలంలో సీజన్ తో సంబంధం లేకుండా అన్ని కాలాలలో చాలా మంది చల్లని నీరు తాగడానికి అలవాటు పడిపోయారు. మామూలు నీటి కంటే ఫ్రిజ్లో ఉండే నీటిని తాగడానికి ఇష్టపడుతున్నారు. ఈ నీరు ఎక్కువగా తాగడం వల్ల ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని వైద్యులు సైతం రుజువు చేయడం జరిగింది. ఇక అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఫ్రిజ్ లో నిల్వ ఉంచిన నీటిని తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు దెబ్బతింటుంది.. ప్రతిరోజు ఈ చల్లని నీటిని తాగితే జీర్ణక్రియ పనిచేయడం తగ్గుతుంది.. కాబట్టి మీరు తినే ఆహారం కూడా అరగదు.. చల్లని నీరు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత లో మార్పులు వచ్చి జీర్ణక్రియ పై ప్రభావం చూపుతాయి.. చల్లని నీటిని అధికంగా తాగడం వల్ల తలనొప్పి , ఎక్కువగా  బ్రెయిన్ ఫ్రీజ్ అయ్యే సమస్య కూడా ఉంటుంది.. ఈ సమస్య ఎక్కువగా అతి చల్లని నీటిని తాగే వారిలోనే అధికంగా కనిపించడం గమనార్హం.

ఇది వెన్నెముక యొక్క సున్నితమైన నరాలను కూడా చల్లబరుస్తుంది.. ఫలితంగా మెదడుపై ప్రభావం చూపడం వల్ల తలనొప్పి, సైనస్  వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి.. మన శరీరంలో మెడ నుండి గుండె.. ఊపిరితిత్తులు.. జీర్ణ వ్యవస్థను నియంత్రించే నాడులు కూడా చల్లబడి పల్స్ రేటు తగ్గిపోయి.. గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువ. అంతే కాదు శరీరంలో ఉష్ణోగ్రతలలో మార్పులు వస్తాయి కాబట్టి అధికంగా కొవ్వు పెరిగే అవకాశం ఉండదు.. పైగా బరువు కూడా పెరుగుతారు. ఇక అందుకే సాధ్యమైనంత వరకు నార్మల్  వాటర్ లేదా గోరువెచ్చని నీటిని తాగడం ఉత్తమం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: