బ్రాహ్మణులు వంటల్లో ఉల్లి, తెల్లగడ్డలను వాడరు... కారణం తెలుసా?

VAMSI
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. వంటల్లో ఉల్లిపాయ, తెళ్లగడ్డ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాలా. ముఖ్యంగా మన తెలుగు వారి వంటల్లో ఈ రెండు లేకుండా వంట చేయడం అంటే దాదాపుగా కష్టమే. అయితే మనం నిత్యం వంటకు ఎంతో ప్రీతికరంగా వినియోగించే ఈ ఉల్లి, తెళ్లగడ్డలను బ్రాహ్మణులు మాత్రం అసలు వారి వంటల్లో ఉపయోగించరు. చాలా వరకు బ్రాహ్మణులు తమ వంటల్లో వీటిని నిషేదిస్తారు, వీటిని వాడటం పాపంగా భావిస్తారు. అయితే వారు ఎందుకు వీటిని దూరం పెడతారు అన్న విషయం ఇతరులకు చాలా మందికి ఇప్పటికీ అనుమానమే. మాంసాహారం అయితే అసలు ముట్టుకోరు అనేది తెలిసిందే, జీవ హింస మహ పాపంగా పరిగణించి బ్రాహ్మణులు మాంసాహారాన్ని అసలు ముట్టరు.

అయితే ఇంతకీ వారి వంటల్లో ఉల్లిపాయలను కానీ, తెళ్ళగడ్డలను కానీ ఎందుకు వాడరు అన్న విషయానికి వస్తే.. బ్రాహ్మణులు కుటుంబాల్లో నిత్య జీవన కలాపాలు, ఆహార నియమాలు వంటివి చాలా నిష్టగా పాటిస్తారు. కాలం మారే కొద్దీ కొంత మార్పు అయితే వచ్చింది. కానీ పురాతన కాలంలో అయితే ఎంతో పటిష్టంగా నియమాలను పాటించే వారు. బ్రాహ్మణులు సాత్విక ఆహారాన్ని తప్ప వేరే ఏ ఇతర ఆహార పదార్థాలను తినరు. ఘాటు వాసన వచ్చే ఆహార పదార్దాలను తినరు. ఎందుకంటే వారిలో ఎక్కువ బ్రాహ్మణులు మంత్రోచ్ఛారణ, వేద పారాయణాలనే వృత్తిగా ఎంచుకుంటారు. ఇందుకు స్పష్టమైన ఉచ్చారణ అవసరం.

అందువలనే వీరు తమో, రజో గుణాలను కలిగించేటటువంటి ఆహార పదార్ధాకు పూర్తిగా దూరంగా ఉంటారు. అదే విధంగా ఉల్లిపాయ, తెళ్లగడ్డలు కూడా ఈ కోవకు చెందినవే. కాబట్టి వీటిని బ్రాహ్మణులు వారి వంటల్లో వాడరు. ఇవి చాలా ఘాటు వాసనను కలిగి ఉంటాయి, తినిన తర్వాత చాలా సేపు వరకు ఆ వాసన పోదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: