లైఫ్ స్టైల్: రాత్రి పూట నిద్ర పట్టకపోతే .. వంటింటి చిట్కాలే బెస్ట్..!

Divya
సెల్ ఫోన్ , టీవీ వాడకం ఎక్కువ అవుతున్న నేపథ్యంలో చాలామందికి రాత్రిపూట సరిగా నిద్ర పట్టడం లేదు.. ఇకపోతే రాత్రిపూట నిద్ర సరిగ్గా పట్టాలి అన్నా.. మెదడు ఆరోగ్యంగా పని చేయాలి అన్నా.. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంతో పాటు తప్పకుండా వ్యాయామం చేయడం, ఒత్తిడిని తగ్గించడంతో పాటు సరిగా నిద్ర పోవడం కూడా ఎంతో అవసరం. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నట్లైతే కొన్ని చిట్కాలను తప్పకుండా పాటించాలి. కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత చాలామంది మానసికంగా ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ పరిస్థితుల్లోనే నిద్ర పోవడం లేదు.
ముఖ్యంగా ఒక్క రోజు సరిగ్గా నిద్రపోయాక పోయినా సరే మరుసటి రోజు ఆ ప్రభావం మన పై పడుతుందని గుర్తుంచుకోవాలి. ఇక మెదడు ఆరోగ్యంగా పని చేయాలి అంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. చాలా మంది డైటింగ్ పేరుతో ఎంత ఆకలిగా ఉన్నా సరే తక్కువ మోతాదులో మాత్రమే ఆహారం తీసుకుంటున్నారు.  అలాంటి వారిలో నిద్ర సరిగ్గా పట్టకపోగా ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయి. సరిగ్గా తినకపోవడం వల్ల నిద్రపై ప్రభావం చూపుతుంది. ఎవరైనా సరే.. ఆయా సీజన్లను బట్టి ఆ సీజన్లో లభించే పండ్లను కడుపునిండా తిని నిద్ర పోవాలి . అంతే కాదు బెల్లం తినడం వల్ల కూడా మంచి ప్రయోజనాలు కలుగుతాయి.

ఇక పడుకునే రెండు గంటల ముందు కడుపునిండా తినాలి.. అలాగే పడుకునే గంట ముందే ఫోన్ , టీవీ వంటి ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను చూడకుండా ఉండాలి.. ఇక అలసట వచ్చే వరకు ఏదైనా మంచి పుస్తకం చదవవచ్చు. అయినా కూడా నిద్రపట్టకపోతే మ్యూజిక్ వినడం.. మీకు నచ్చిన పని చేయడం.. ఇంట్రెస్టింగ్ గా వుండే కథలు వినడం లాంటివి చేయడం వల్ల నిద్ర తప్పకుండా పడుతుంది. పోషకాలు  కలిగిన ఆహారాలను మాత్రం ఖచ్చితంగా తీసుకుంటే నిద్ర బాగా పడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: