లైఫ్ స్టైల్: బంగాళదుంపను ఇలా తింటున్నారా.. అయితే ఈ వ్యాధులు మీవెంటే..!!
మనం మితిమీరి ఏ ఆహార పదార్థాలు తిన్నా.. అది మనకు హానికరంగా మారవచ్చు. అయితే మనం బంగాళదుంపను ఎక్కువగా తీసుకుంటే పలు జాగ్రత్తలను పాటిస్తూ ఉండాలి. ఎందుచేత అంటే దీనివల్ల మనకు అలర్జీ సమస్యలు కూడా రావచ్చు.
ముఖ్యంగా బంగాళదుంప లో ఉండే కార్బోహైడ్రేట్లు, కీళ్ల నొప్పులను మరింత పెంచడానికి అవకాశం ఉంటుంది. అందుచేతనే కీళ్ళ నొప్పులతో బాధపడే రోగులు ఈ బంగాళదుంపలను తినకపోవడం మంచిది.
మధుమేహంతో బాధపడే వారు బంగాళదుంపను అసలు తినకూడదు. ఎందుచేత అంటే బ్లడ్ షుగర్ అదుపులో ఉండాలి అంటే కచ్చితంగా బంగాళదుంప కు దూరంగా ఉండాలి. లేకపోతే రక్తంలో చక్కెర స్థాయి విలువలు పెరిగి.. మధుమేహం మరింత పెరిగేలా చేస్తాయి.
బంగాళాదుంపను ఎక్కువగా తింటే రక్త పోటుకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుచేతనే బిపి రోగులు ఎవరైనా సరే బంగాళదుంపను తక్కువగా తినడం మంచిది.
బంగాళదుంపలలో ఎక్కువగా కార్బోహైడ్రేట్లు ఉండటం వల్ల ఇవి కేలరీలను పెంపొందిస్తాయి. ఇక అంతే కాకుండా ఇది ఊబకాయానికి కూడా దారితీస్తుంది. సన్న బడాలనుకుంటున్న వారు ఈ బంగాళ దుంపను తక్కువ తినడం మంచిది.