లైఫ్ స్టైల్: బరువు తగ్గాక ఇలాంటి ఆహార పదార్థాలు తప్పకుండా తినాల్సిందే..!!
పోషకాలు అధికంగా ఉండే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి.. ఇక కూరగాయలు, తృణధాన్యాలు, పండ్లు, రోటీ, సబ్జీ , ఆకుకూరలు వంటివి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తినడం వల్ల బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవచ్చు ముఖ్యంగా చిప్స్, కుకీలు , ఫ్రైడ్ ఐటమ్స్ లాంటివి తీసుకోవడం మానేయాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉండవచ్చు.
ఇక కార్బోహైడ్రేట్లను ప్రోటీన్లతో భర్తీ చేయడం తప్పనిసరి.. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం మానేసి.. ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల బరువు పెరగకుండా ఆరోగ్యంగా ఉంటారు.
ఇక బరువు తగ్గిన తర్వాత తక్కువ కేలరీలు ఉన్న ఆహారం తీసుకోవాలి. లేకపోతే బెల్లీ ఫ్యాట్ పెరిగిపోయే అవకాశం ఉంటుంది. ఇక అలాగే వర్కౌట్స్ చేయడం మానేయకూడదు. యోగ , ఎక్సర్సైజ్ లాంటివి కంటిన్యూ చేస్తూ ఉండాలి.
కచ్చితమైన సమయానికి ఆహారం తీసుకోవాలి.. లేకపోతే అనారోగ్య సమస్యలు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చాలా మంది పరధ్యానంలో మోతాదుకు మించి అధికంగా ఆహారాన్ని తీసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల శరీరంలో కొవ్వులు పేరుకోవడానికి ఆస్కారం వుంటుంది. కాబట్టి ఆలస్యంగా భోజనం చేయకూడదు అలాగని ఎక్కువగా తినకూడదు. సమయానికి సరైన నిష్పత్తిలో ఆహారం తీసుకుంటే మళ్లీ బరువు పెరిగే అవకాశం ఉండదు.