లివర్ : పాడవ్వకుండా ఇవి తినండి!

Purushottham Vinay
ఇక మన శరీరంలోని ఇతర భాగాల లాగే కాలెయం కూడా ఆరోగ్యంగా ఉండాలి. అయితే కొన్ని రకాల ఆహారాలు అయితే లివర్ ను ఆరోగ్యంగా ఉంచుతాయి.ఇతర అవయవాల మాదిరిగాne కాలేయ ఆరోగ్యం కూడా చాలా ముఖ్యమైనది. శరీరం నుండి మలినాలను బయటకు పంపడంలో కాలేయం కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కామెర్లు, ఫ్యాటీ లివర్,లివర్ సిర్రోసిస్ అనేవి కాలేయాన్ని ప్రభావితం చేసే వ్యాధులు. ఆరోగ్యకరమైన ఆహారం ఇంకా అలాగే క్రమశిక్షణతో కూడిన జీవనశైలి కాలేయాన్ని రక్షించగలవు.కాఫీ అనేది కాలేయాన్ని రక్షించడానికి ఎంతగానో సహాయపడుతుంది. దీన్ని క్రమం తప్పకుండా కాఫీ తీగడం వల్ల నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అభివృద్ధి చెందే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది. Southampton university నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే..ప్రతి రోజూ కాఫీ తాగే వారికి కాలేయ వ్యాధి వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది. అలా అని కాఫీని కప్పులకు కప్పులను తాగేయకూడదు.అలాగే సిట్రిస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.


కాలేయం ఆరోగ్యానికి ద్రాక్ష ఇంకా అలాగే నారింజ వంటి సిట్రస్ పండ్లను తినాలని వైద్యులు సూచిస్తున్నారు. వీటిలో 'పాలీఫెనాల్స్' అనే యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువ మొత్తంలో ఉంటాయి.అందువల్ల ఇవి కాలేయాన్ని రక్షిస్తాయి.సాల్మన్, సార్డినెస్ మరియు ట్యూనా వంటి కొవ్వు చేపలలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు అనేవి చాలా అధికంగా ఉంటాయి. ఒమేగా -3 లను భర్తీ చేయడం వల్ల కాలేయ కొవ్వును తగ్గించడం ఇంకా అలాగే మంచి HDL కొలెస్ట్రాల్ ను పెంచడం ఇంకా ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడం ద్వారా Nonalcoholic fatty liver disease (NAFLD) ఉన్నవారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని అధ్యయనం తేల్చి చెప్పింది.అలాగే ఓట్స్ కూడా మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. ఇది NAFLD-సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. దీనిలో ఫైబర్ అనేది చాలా సమృద్ధిగా ఉండటం వల్ల ఇది కాలేయాన్ని సంరక్షిస్తుంది. ఇంకా అలాగే మలబద్దకం నుంచి కూడా మంచి ఉపశమనం కలిగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: