లైఫ్ స్టైల్: రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి పెరగాలి అంటే వీటిని తినాల్సిందే..!!
ఇక ఐరన్ రిచ్ వెజిటబుల్స్, పాలకూర, మెంతి ఆకుల్లో ఇనుము సమృద్ధిగా లభిస్తుంది. కాబట్టి వీటిని తినడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయి కూడా పెరుగుతుంది. ఇక బీట్రూటు ఐరన్ కి ఒక గొప్ప మూలం వంటిది. కాబట్టి ప్రతి రోజూ బీట్రూట్ ను సలాడ్లు, జ్యూస్, కూరలా చేసుకొని తినవచ్చు. ముఖ్యంగా బీట్ రూట్ ను ఒక తీపి వంటకం లాగ కూడా మీరు తయారు చేసుకొని తినవచ్చు.ఇక ఎలా తిన్నా సరే బీట్రూట్ ద్వారా లభించే అన్ని పోషకాలు కూడా మీకు లభిస్తాయి. వీటితోపాటు ఎర్రటి మాంసం, బీఫ్, మటన్, చికెన్ కాలేయం, బొప్పాయి, నారింజ ,స్ట్రాబెరి వంటి పండ్ల లో ఐరన్ లభిస్తుంది. క్యాప్సికం, టమోటా, క్యాబేజీ ,పాలకూర వంటి వాటిలో కూడా ఉంటుంది కాబట్టి వీటిని తినడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది. ఇక నల్ల ద్రాక్ష తినడం వల్ల కూడా రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది.