లైఫ్ స్టైల్ : రోజంతా చురుకుగా ఉండాలి అంటే ఈ జ్యూస్ తాగాల్సిందే..!!

Divya

ఈ మధ్యకాలంలో చాలామంది ఏ చిన్న పని చేయడానికి అయినా సరే పెద్దగా ఆసక్తి చూపడం లేదు.. అంతేకాదు ఒక చిన్న పని చేస్తే చాలు పూర్తిగా అలసిపోవడం నీరసించి పోవడం  వంటి లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. అలాంటి వాళ్ళు ప్రతిరోజు ఆరోగ్యంగా, చురుగ్గా,  ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే టమాటో రసం తాగాలి అని వైద్యులు సూచిస్తున్నారు మినరల్స్,  విటమిన్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి చర్మం,  గుండె,  కళ్ళు సమస్యలను తొలగించడంలో సహాయపడతాయి. బ్రేక్ ఫాస్ట్ లో టమాటో జ్యూస్ తాగడం వల్ల మీ పొట్ట రోజంతా యాక్టివ్ గా ఉంటుంది అని చెప్పవచ్చు. మరి టమాటో రసం తాగడం వల్ల మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయి.. ఇప్పుడు ఒకసారి  చదివి తెలుసుకుందాం.
టమాటో రసం తాగడం వల్ల మీ చర్మానికి మంచి కలుగుతుంది. ఇక సూర్యరశ్మితో ఏర్పడే చర్మం రంగు కచ్చితంగా టొమాటో రసం మారుస్తుంది. ఇక మొటిమలు వంటి సమస్యలను తొలగించడంలో కూడా టమోటా రసం బాగా పనిచేస్తుందని చెప్పవచ్చు . ఇక ఇందులో ఉండే విటమిన్లు,  ఐరన్ జుట్టు రాలడాన్ని కూడా నివారిస్తాయి.  అంతేకాదు జిడ్డు చర్మాన్ని దూరం చేయడంలో టమోటా రసం బాగా సహాయపడుతుంది.
ఇక ఈ టమాటో రసాన్ని రెగ్యులర్ గా తాగితే జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయడంతోపాటు అజీర్తి సమస్య కూడా దూరం అవుతుంది. మలబద్ధకం కూడా దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
టమోటా రసం లో చెడు కొలెస్ట్రాల్ ను  తగ్గించే విటమిన్లు ఉంటాయి.  అంతేకాదు విటమిన్ సి,  విటమిన్ ఏ, లైకోపీన్,  బీటా కేరటిన్ వంటి వాటి వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇక టమోటాలను క్రమం తప్పకుండా తీసుకున్నట్లయితే మంట,  ఆక్సీకరణ ఒత్తిడి కూడా అదుపులో ఉంటుంది.
టమాటోలలో లూటీన్ ఉండడం వల్ల అతినీల కిరణాల నుంచి కళ్ళను రక్షిస్తాయి. ముఖ్యంగా టమోటాలు తరచూ తినేవారి కళ్ళు చాలా కాలం పాటు బాగా పనిచేస్తాయని పరిశోధకులు కూడా చెబుతున్నారు. కంటి సమస్యలను దూరం చేయడంలో చాలా బాగా సహాయపడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: