అమ్మాయిల హైట్ విషయంలో గమనించాల్సిన విషయాలు?

Purushottham Vinay
ఇక ఒక వ్యక్తి వికాసానికి మంచి ఎత్తు ఉండటం కచ్చితంగా అవసరం.ముఖ్యంగా అమ్మాయిలకు ఇది చాలా ముఖ్యం.మంచి ఎత్తు అనేది ఖచ్చితంగా మీలో దాగి వున్న ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది.అయితే పొడవాటి అమ్మాయిలు మరింత అందంగా కనిపిస్తారని నమ్మకం. కానీ అమ్మాయిల ఎత్తు పెరగడం కూడా చాలా త్వరగా ఆగిపోతుంది. అయితే దీనికి చాలా కారణాలున్నాయి.శరీరంలో హార్మోన్ల మార్పుల వల్ల 14-15 ఏళ్లు దాటినా ఆడపిల్లల ఎత్తు వెంటనే ఆగిపోతుంది. ఆడపిల్లల ఎత్తు అంతగా పెరగకపోవడానికి గల కారణాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం.బాల్యంలో అమ్మాయిల ఎత్తు చాలా వేగంగా పెరుగుతుంది. కానీ 14-15 సంవత్సరాల వయస్సులో వారి పెరుగుదల అనేది తక్కువగా ఉంటుంది.ఇక ఋతుస్రావం ప్రారంభమైనప్పుడు ఎత్తు పెరగడం ఆగిపోతుంది. పీరియడ్స్ ప్రారంభమైన కొంత కాలానికి వారి ఎత్తు పెరుగుదల మందగిస్తుంది. ఈ పరిస్థితిలో కనుక అమ్మాయి ఎత్తు తక్కువగా ఉంటే దాని గురించి ఖచ్చితంగా వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది.పీరియడ్స్ ప్రారంభానికి ముందు 1-2 సంవత్సరాల వరకు బాలికల ఎత్తుచాలా వేగంగా పెరుగుతుంది. కానీ తర్వాత వారి పెరుగుదల ఆగిపోతుంది.



చాలా మంది అమ్మాయిలకి 8 నుంచి 13 సంవత్సరాల వయస్సులో రుతుక్రమం అనేది ప్రారంభమవుతుంది. ఆ తరువాత బాలికలు ఎత్తు 1-2 అంగుళాలు మాత్రమే పెరుగుతారు. ఈ వయస్సులో అమ్మాయిలు ఇక తమ వయోజన ఎత్తుకు చేరుకుంటారు. కొంతమంది అమ్మాయిలు అయితే చిన్న వయస్సులోనే పెద్దల ఎత్తుకు చేరుకుంటారు. ఇంకా ఇది వారి పీరియడ్స్ రాకపై ఆధారపడి ఉంటుంది.మంచి ఎత్తు కోసం పిల్లలకు సరైన ఆహారం అందించడం చాలా అవసరం. ఆకుపచ్చ కూరగాయలు, విటమిన్లు ఇంకా అలాగే అవసరమైన పోషకాలతో బాలికల రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది.ఇది వారి ఎత్తును కూడా పెంచుతుంది.శారీరక శ్రమ ద్వారా కూడా ఎత్తు పెరుగుదల అనేది జరుగుతుంది. నీరు ఎక్కువగా తాగడం వల్ల ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. మీరు రోజంతా కూడా సరైన మొత్తంలో నీరు తాగకపోతే అది మీ పెరుగుదలను ప్రభావితం చేస్తుంది. ఇంకా ఆరోగ్య వృద్ధికి తగినంత నిద్ర పోవడం చాలా ముఖ్యం. నిద్ర లేకుంటే అది ఖచ్చితంగా హైట్‌ పెరగడంపై ప్రభావం పడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: