లైఫ్ స్టైల్: ఉదయం ఖాళీ కడుపుతో నీరు తాగడం మంచిదేనా..?
అయితే గోరువెచ్చని నీటిని తాగడం వల్ల పలు ప్రయోజనాలు ఉన్నాయి. అయితే వాటితో పాటే నష్టాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఉదయం నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిని తాగినట్లు అయితే శరీరంలో ఉండే టాక్సిన్స్ బయటకి వెళ్లిపోతాయి అలాగే మనం భోజనం చేసిన తరువాత గోరువెచ్చని నీటిని తాగడం వల్ల జీర్ణక్రియ వేగవంతంగా పనిచేస్తుంది. అధిక మొత్తంలో నీటిని తాగడం వల్ల బరువు తగ్గవచ్చు అని వైద్యులు సూచిస్తున్నారు.
భోజనం చేసే ముందు నీటిని తాగి భోజనం చేయడం వల్ల జీర్ణక్రియ చాలా మెరుగుపడుతుంది అంతేకాకుండా వేడి నీరు కొవ్వును విచ్చిన్నం చేసి జీర్ణ క్రియ సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. ముఖ్యంగా ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ తినడం వల్ల ప్రతిరోజు కావలసినంత శక్తి కూడా లభిస్తుంది. ముఖ్యంగా పగటిపూట భోజనం అసలు మానేయకూడదు. ఆకలిగా అనిపిస్తే ఏవైనా పండ్లు విత్తనాలను తినమని వైద్యులు సూచిస్తున్నారు. ఎందుచేత అంటే వీటిలో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది కనుక శరీరానికి అలసటగా అనిపించదు. ఇలాంటి పద్ధతులను పాటించడం వల్ల బరువు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారు వేడి నీటిని తాగవచ్చు.