లైఫ్ స్టైల్: వాము గింజలతో బోలెడు ప్రయోజనాలు.. తెలిస్తే షాక్..!

Divya
వాము అనేది ప్రతి ఒక్కరి వంట గదిలో మసాలా దినుసులతో ఒకటిగా ప్రాధాన్యత తెచ్చుకుంది. ముఖ్యంగా వాము ఆయుర్వేదంలో కూడా ఎక్కువగా వాడబడింది. ఇక ఘాటుగా కొంచెం కారంగా ఉంటుంది.. ఇక అమ్మమ్మల కాలం నుండి ఈ వామును ఇంటి చిట్కాగా ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఎవరికైనా కొంచెం కడుపునొప్పిగా అనిపిస్తే నోట్లో కాస్త వామును వేసుకోమని పెద్దవాళ్లు చెబుతూ ఉంటారు. వామును నమిలి రసం మింగడం వల్ల కడుపులో ఉండే నులి పురుగులు కూడా చనిపోతాయట. అంతేకాదు వాము తీసుకున్న తర్వాత ఆహారం కూడా బాగా జీర్ణం అవుతుంది అని కడుపునొప్పి , కడుపు ఉబ్బరం , అజీర్తి వంటి సమస్యలను తగ్గిస్తుంది అని సమాచారం.

అంతేకాదు రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది. ప్రస్తుతం వానలు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో చాలామంది దగ్గు, జలుబు,  జ్వరం వంటి వ్యాధులకు తరచూ గురి అవుతున్నారు.  అలాంటప్పుడు వేడిపాలలో కొంచెం వాముపొడి కలుపుకొని తాగితే మంచి ఉపశమనం కూడా కలుగుతుంది.  అంతేకాదు తలనొప్పి కూడా ఇట్టే తగ్గిపోతుంది. ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు వాములో ఉండే విటమిన్ సి మన శరీరానికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఇక వాములో ఉండే ఎన్నో పోషకాలు గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. కాబట్టి రోజు వారి ఆహారంలో వామును చేర్చుకుంటే మంచిదని నిపుణులు సైతం సూచిస్తున్నారు.

ఇకపోతే వామును పొడిగా చేసుకొని నిల్వ చేసుకోవాలి. వాము పొడిలో నీటిని కలిపి పేస్ట్ గా  చేసి కీళ్ల నొప్పులు,  మోకాల నొప్పులు ఉన్న ప్రదేశంలో మర్దన చేస్తే నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. మైగ్రేన్ తలనొప్పి, జలుబు వంటి వాటికీ మంచి మెడిసిన్ అని చెప్పవచ్చు. ఇకపోతే వాము పొడిని ఒక గుడ్డలో కట్టి మెల్లగా వాసన చూస్తూ ఉంటే జలుబు , తలనొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.  ముఖ్యంగా వేడి నీటిలో వామును కలుపుకొని తాగడం వల్ల కిడ్నీలో రాళ్ల సమస్యలు,  వాంతులు వంటివి కూడా దూరం అవుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: