లైఫ్ స్టైల్: డయాబెటిస్ వారు బెల్లం తినవచ్చా..?

Divya
ముఖ్యంగా డయాబెటిస్ వచ్చింది అంటే జీవితకాలం ఇక మందులపైన మన జీవితం కొనసాగుతుంది అని చెప్పాలి. అలా మందులు వాడితే డయాబెటిస్ నియంత్రణలో ఉంచే ఆహారాలను మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు ఎలాంటి ఆహారం తీసుకోవాలన్నా సరే ఆచితూచి అందులో చక్కెర క్వాంటిటీ ఉందో లేదో గమనించి మరీ తీసుకోవాలని వైద్యుల సైతం సలహా ఇస్తూ ఉంటారు. ఎందుకంటే డయాబెటిస్ నియంత్రణలో ఆహారం కూడా చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఇక డయాబెటిస్ ఉన్నవారికి తీసుకునే ఆహార విషయంలో ఎన్నో సందేహాలు కూడా ఉంటాయి. అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా వైద్యుల సలహా మేరకు ఆహారం తీసుకోవాలి.
మనలో చాలామందికి డయాబెటిస్ ఉన్నవారు పంచదార తింటే మంచిదా? బెల్లం తింటే మంచిదా? అనే సందేహం ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. ఇక అలాంటప్పుడు పంచదార,  బెల్లం రెండూ ఒకే పదార్థం నుండి తయారు అవుతాయి. అలాగే క్యాలరీలు కూడా సమానంగా ఉంటాయి. ఇక గ్లైసమిక్ ఇండెక్స్ కూడా రెండింటిలోనూ ఎక్కువే ఉంటుంది. ముఖ్యంగా బెల్లం సహజ సిద్ధంగా తయారు చేస్తారు. కాబట్టి పోషకాలు కూడా అలాగే లభిస్తాయి. ఇక పంచదార అనేది శుద్ధి ప్రక్రియ ద్వారా తయారు చేస్తారు. కాబట్టి ఇందులో పోషకాలు ఉండవు. పైగా తీపి గుణం ఎక్కువగా ఉంటుంది .కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు పంచదారకు బదులుగా బెల్లం తినవచ్చు. అయితే పరిమిత మోతాదులో మాత్రమే తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
మీరు తీసుకునే బెల్లం ముదురు రంగులో ఉంటే మరీ మంచిది. లేత రంగు వుండే బెల్లంలో రసాయనాలు ఎక్కువగా వాడతారు. బెల్లం ఆహరం లో భాగంగా చేసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు ఉండవు.. అలాగే  శ్వాసకోశ వ్యవస్థ శుభ్రం అవుతుంది. అందుకే మామూలు ఆరోగ్యవంతులు కూడా పంచదారకు బదులు బెల్లం వాడితే ఎటువంటి సమస్యలు దరి చేరవు. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు అపోహ మాని బెల్లాన్ని ఆహారంలో చేర్చుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: