లైఫ్ స్టైల్: వంకాయలను వీరు అసలు తినకూడదట..!
మరి ఎలాంటి సమస్యలు ఉన్నవారు వంకాయ కూరను తినకూడదు అనే విషయాన్నికొస్తే ముఖ్యంగా అరుగుదల తక్కువగా ఉండేవారు వంకాయ కూర తినకూడదు. అలాంటి వారికి గ్యాస్ సమస్యలు మరింత ఎక్కువవుతాయి . ఇక అలాగే ఎలర్జీ ఉన్నవారు కూడా వంకాయని తినకూడదు. ఇలా తింటే దద్దుర్లు, దురద మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ఇక అలాగే డిహైడ్రేషన్ తో బాధపడే వారు కూడా వంకాయలను తినకుండా ఉండడమే మంచిది. ఇక డీ హైడ్రేషన్ తో పాటు ఇతర ఆందోళన సమస్యలతో బాధపడే వారు కూడా వంకాయను తినకూడదు. రక్తహీనత సమస్యతో ఉన్నవారు కూడా వంకాయలు తింటే మరింత సమస్య పెరిగే అవకాశం ఉంటుంది.
అంతేకాదు కళ్ళల్లో మంట, వాపు, దురద వంటి సమస్యలు ఉన్నవారు కూడా వంకాయ కు దూరంగా ఉండాలి. అలాగే ఫైల్స్ సమస్యతో బాధపడేవారు వంకాయను ఎట్టి పరిస్థితుల్లో కూడా తినకూడదు. అంతేకాదు మరిన్ని సమస్యలతో లేదా ఏదైనా ఇతర చర్మ గాయాలతో బాధపడే వారు కూడా వంకాయకు దూరంగా ఉండాలి. ఇక ఇలాంటి సమస్యలు ఉన్నవారు అసలు వంకాయ తినకూడదు. ఒకవేళ తింటే పరిస్థితిని మరింత విషయం చేసుకున్నవారు అవుతారు. కాబట్టి ఒకవేళ తినాలి అనుకుంటే వైద్యుల సలహాతో వంకాయ కూర తినవచ్చు.